పవర్ ఫుల్ ఇంజన్ తో బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైక్స్ లాంచ్.. ధర, లేటెస్ట్ ఫీచర్స్ తెలుసుకొండి..
లగ్జరీ కార్లకు ప్రసిద్ధి చెందిన జర్మన్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మోటరాడ్ ఇండియా భారతదేశంలో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9 టి, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9 టి స్క్రాంబ్లర్ బైక్‌లను విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త బైక్‌ను కంప్లీట్ బిల్ట్ ఇన్ యూనిట్‌గా (సిబియు) విక్రయించనుంది. అంటే వాటిని పూర్తిగా భారతదేశంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తారు. ఈ రెండు కొత్త బైక్‌ల కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మోటార్‌బైకులను బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.
కొత్త ఫీచర్లు
కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9టి డిజైన్ మోటర్‌స్పోర్ట్స్ ట్రెడిషన్ నుండి ప్రేరణ పొందుతుంది. దీనికి అనలాగ్ స్పీడోమీటర్ డిస్ ప్లే , ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ లైట్లతో కొత్తగా రూపొందించిన వృత్తాకార పరికరం క్లాసిక్ ఇమేజ్‌ని మరింత పెంచుతుంది. ఇది అధిక నాణ్యత గల మెటల్ కేసింగ్‌లో వస్తుంది, దానిపై బిఎండబల్యూ లోగో ఉంటుంది. ఇప్పుడు ఈ మోడళ్లలో డేటైమ్ రన్నింగ్ లైట్లతో అత్యాధునిక ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు అందించారు.
శక్తివంతమైన ఇంజన్
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9 టి, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9 టి స్క్రాంబ్లర్ లో స్పష్టమైన డిజైన్, బలమైన టార్క్, విలక్షణమైన సౌండ్ (థొరెటల్ సౌండ్) తో వస్తుంది. శక్తివంతమైన 1,170 సిసి, 2-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో అందించారు. 7,520 ఆర్‌పిఎమ్ వద్ద 109 హెచ్‌పి అవుట్ పుట్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 119 ఎన్‌ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 0–100 కి.మీ స్పీడ్ కేవలం 3.5 సెకన్లలో అందుకుంటుంది. అలాగే గంటకు 200 కి.మీ వేగంతో వెళ్లగలదు.
ధర
కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9టి బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ .18,50,000. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9 టి స్క్రాంబ్లర్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .16,75,00.
కలర్ స్కీమ్
కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9టి బైక్ బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్ / బ్రష్డ్ అల్యూమినియం, మినరల్ వైట్ మెటాలిక్ / నైట్ బ్లాక్ మాట్టే / అల్యూమినియం మాట్టే రంగులలో లభిస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9టి స్క్రాంబ్లర్ బైక్ గ్రానైట్ గ్రే మెటాలిక్, కాస్మిక్ బ్లూ మెటాలిక్ / లైట్ వైట్, బ్లాక్ స్ట్రోమ్ మెటాలిక్ / రేసింగ్ రెడ్, బ్లాక్ మెటాలిక్ మాట్టే వంటి కొత్త కలర్ ఆప్షన్స్ ని కంపెనీ ప్రవేశపెట్టింది.
బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ప్రీమియం డీలర్ నెట్‌వర్క్ లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9టి, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 9టి స్క్రాంబ్లర్ సేల్స్, సర్వీసింగ్‌పై వారంటీ ఇస్తుంది. దీనితో పాటు బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ బైక్‌లు 3 సంవత్సరాల వరకు ఆన్ లిమిటెడ్ కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ తో వస్తుంది. అదనంగా చెల్లించి వారంటీని నాల్గవ, ఐదవ సంవత్సరానికి కూడా పొడిగించుకోవచ్చు.