MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bike Riding Tips in Rain: వర్షంలో బైక్ రైడింగ్ చేస్తున్నారా.. ప్రమాదాలను నివారించడానికి ఈ టిప్స్ పాటించండి

Bike Riding Tips in Rain: వర్షంలో బైక్ రైడింగ్ చేస్తున్నారా.. ప్రమాదాలను నివారించడానికి ఈ టిప్స్ పాటించండి

భారతదేశంలో రుతుపవనాలు ప్రవేశించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితిలో డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు కూడా డ్రైవర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి వాతావరణంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి అనే వాస్తవాన్ని మనం పాటించాలి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 20 2022, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని డ్రైవర్లు గమనించాలన్నారు. అలాగే మీరు వర్షంలో మీ బైక్‌ను నడుపుతున్నట్లయితే తడి రోడ్లు అలాగే తక్కువ విజిబిలిటీని ఎదుర్కోవటానికి చాలా సహాయపడుతుంది. 

వర్షాకాలంలో బైక్‌లు, స్కూటర్‌లు నడిపేవారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. రోడ్లు జారుడుగా మారడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఒక్కోసారి చిన్న పొరపాట్లు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వర్షాకాలంలో రోడ్డుపై మీ భద్రతను నిర్ధారించడానికి  కొన్ని ముఖ్యమైన చిట్కాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్పీడ్ తక్కువగా 
వర్షాకాలంలో వేగంగా డ్రైవ్ చేయవద్దు. ఎందుకంటే వర్షంలో రహదారిపై ట్రాక్షన్ తగ్గుతుంది, దాని కారణంగా వాహనంపై మీ కంట్రోల్ కూడా తగ్గుతుంది. అది బైక్ అయినా, స్కూటర్ అయినా ఇది మాత్రమే కాదు, డ్రైవింగ్ సమయంలో సడన్ బ్రేకింగ్ కారణంగా బ్రేకులు కూడా ప్రభావవంతంగా ఉండవు. భారీ వర్షాలకు విజిబిలిటీ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల, వర్షాకాలంలో, మీ ద్విచక్ర వాహనం  వేగాన్ని గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
 

36

రోడ్డు నిండా నీరు ఉంటే 
వర్షాకాలంలో రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి. దీంతో రోడ్లపై చాలాసార్లు పెద్ద పెద్ద గుంతలు కనిపించవు. రాత్రిపూట ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, నీరు నిండిన చోట అస్సలు డ్రైవ్ చేయవద్దు. అంతే కాదు ఎగ్జాస్ట్‌లోకి నీరు ఎక్కువగా  వెళ్ళడం వల్ల వాహనం ఆగిపోయే ప్రమాదం ఉంది. 
 

46

ఫింగర్ వైపర్‌లు
ఈ రోజుల్లో మార్కెట్లోకి ఫింగర్ వైపర్‌లు రావడం ప్రారంభించాయి, ఇవి హెల్మెట్  వ్యూ పై నీటి బిందువులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఫింగర్ వైపర్లు చాలా ఖరీదైనవి కావు. సాధారణంగా వీటి ధర రూ.100 నుంచి మొదలవుతుంది. వర్షంలో హెల్మెట్ వైజర్ (గ్లాస్)పై చుక్కలు పడటం వల్ల చూడటం కష్టం. రోడ్డు సరిగ్గా కనిపించదు, ఈ కారణంగా ప్రమాదం పెరుగుతుంది. 

56

హెల్మెట్ ధరించడం
మీరు ఎక్కడికైనా  వెళ్తున్నప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్ లేదా స్కూటర్ నడపకండి. ముఖ్యంగా వర్షకాలం రోజుల్లో హెల్మెట్ ధరించండి. వర్షం కురుస్తున్న సమయంలో హెల్మెట్ వైజర్ కారణంగా వర్షపు చినుకులు కళ్లపై పడకుండా ఉండడంతో బైక్ నడపడం సులువుగా ఉంటుంది. అలాగే హెల్మెట్ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. హెల్మెట్ ధరించకపోతే జరిమానా మాత్రమే కాదు, మీ జీవితంతో కూడా ఆడుకుంటుంది. 
 

66

సరైన దూరాన్ని నిర్వహించండి
వర్షాకాలంలో  మీ ముందు వెళ్లే వాహనం నుండి మీ వాహనాన్ని ఎల్లప్పుడూ సరైన దూరంలో ఉంచండి. ముఖ్యంగా ఓవర్‌లోడింగ్‌తో నడుస్తున్న వాహనాలు. సరైన సమయంలో బ్రేకులు పడకపోవడంతో వర్షంలో రోడ్డుపై ట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, వాహనం  హెడ్‌లైట్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచండి. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు రూ.15 తగ్గుతుందా? కారణమేంటో తెలుసా?
Recommended image2
Mahindra Thar OG: సూపర్ లుక్స్, మోర్ పవర్ అండ్ కిల్లింగ్ సేఫ్టీ ఫీచర్స్ తో కొత్త మహీంద్రా థార్ OG వచ్చేసింది
Recommended image3
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved