Best Scooters: తక్కువ ధరలో మంచి స్కూటర్ కొనాలంటే.. ఇవే బెస్ట్ ఆప్షన్!
భారతదేశ మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్కూటర్లు వస్తూనే ఉంటాయి. వాటిలో తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే ఎక్కువమంది సెలెక్ట్ చేసుకుంటారు. అలా బడ్జెట్ లో దొరికే బెస్ట్ స్కూటర్లను ఒకసారి చూసేయండి

దేశ మార్కెట్ లో ఏటా కొత్త ఫీచర్లతో టూవీలర్లు వస్తూనే ఉన్నాయి. తక్కువ ధర, బెస్ట్ మైలేజ్, మంచి కంఫర్ట్ కలిగిన స్కూటర్లను వినియోగదారులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. మార్కెట్ లో ఎన్ని ఉన్నా కొన్ని స్కూటర్లను మాత్రం ఏరికోరి కొనుక్కుంటూ ఉంటారు. కంపెనీలు సైతం పోటీ పడి మరీ వారి అవసరాలకు తగ్గట్టుగా కొత్త మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. అలా మంచి ఫీచర్లతో తక్కువ ధరలో దొరికే కొన్ని స్కూటర్లు మీకోసం. ఒకసారి చూసేయండి.
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్
ఎక్కువమంది ఇష్టపడే స్కూటీల్లో టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ ముందు వరుసలో ఉంటుంది. ఇది చాలా తేలికైన, చిన్న స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 65,500 వరకు ఉంటుంది. ఇది 87.8cc ఇంజిన్‌తో వస్తుంది. సిటీలో తిరగడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈజీ ఎలక్ట్రిక్ స్టార్ట్, అలాయ్ వీల్స్, USB ఛార్జింగ్ పోర్ట్ దీని ప్రత్యేకతలు.
హీరో ప్లెజర్ ప్లస్
హీరో ప్లెజర్ ప్లస్.. స్టైలిష్ డిజైన్, స్మూత్ పెర్ఫార్మెన్స్ కి పేరు పొందింది. దీని ధర రూ. 71,200 నుంచి మొదలవుతుంది. ఇది 110.9cc ఇంజిన్‌తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, అలాయ్ వీల్స్, USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
హోండా యాక్టివా 6G
అత్యంత ప్రజాధరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన యాక్టివా 6G ధర 78,600. ఈ స్కూటీ 109.51cc ఇంజిన్‌తో మంచి మైలేజ్ ఇస్తుంది. అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఉండటం వల్ల ఇది సేఫ్టీగా ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్
తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వాళ్లకి టీవీఎస్ జూపిటర్ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 73,700 నుంచి మొదలవుతుంది. 113.3cc ఇంజిన్‌తో కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాయ్ వీల్స్ ఉన్నాయి.