బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ రి-ఓపెన్.. ఇప్పుడు మీ నగరంలో ఎంత చెల్లించాలంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ప్రముఖ వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ను మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
తాజాగా ఇప్పుడు మరో మూడు కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగులను ప్రారంభించింది. వీటిలో మైసూర్, మంగళూరు, ఔరంగాబాద్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఈ మూడు నగరాల్లో నివసించేవారైతే మీరు బజాజ్ ఇ-స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. స్కూటర్ బుకింగ్ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు.
ఈ నగరాల్లో చేతక్ ఇ-స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు రూ .2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గత వారం కంపెనీ నాగ్‌పూర్‌లో చేతక్ బుకింగ్ ప్రారంభించింది. పూణే, బెంగళూరు తరువాత బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న మూడవ భారతీయ నగరంగా నాగ్పూర్ నిలిచింది. అంతకుముందు, పూణే, బెంగళూరులో చేతక్ స్కూటర్ల బుకింగ్ స్లాట్లు 48 గంటలలోపు ఉందేది.
2022 నాటికి మరో 22 భారతీయ నగరాలకు విస్తరించాలని బజాజ్ ఆటో యోచిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ చెన్నై, హైదరాబాద్ లలో లాంచ్ కానుంది. భారతీయ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టివిఎస్ ఐక్యూబ్, అథర్ 450 ఎక్స్, ఓలా ఇ-స్కూటర్లతో పాటు పలు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ప్రజల నుండి గొప్ప స్పందనను పొందింది. ఓలా ఇ-స్కూటర్ బుకింగులను ప్రారంభించిన మొదటి 24 గంటల్లోనే లక్ష బుకింగ్‌లు జరిగాయని కంపెనీ తెలిపింది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గొప్ప లూక్స్ తో స్టైలిష్ స్కూటర్. గత ఏడాది కంపెనీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ చేటక్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ అండ్ టాప్-ఎండ్ ప్రీమియం వేరియంట్. నగరాల్లోని ముఖ్యంగా యువతలో ఈ స్కూటర్ కి చాలా క్రేజ్ ఉంది.
ఈ ఇ-స్కూటర్‌లో 3.8 కిలోవాట్ల శక్తి, 4.1 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటారు లభిస్తుంది. స్కూటర్‌లో అందించిన ప్రత్యేక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వల్ల బ్యాక్ టైర్లకు శక్తి లభిస్తుంది. చేతక్ ఇ-స్కూటర్ 3kWh లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జింగ్ తరువాత ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్‌లో 85 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. అయితే మైలేజ్ వేర్వేరు డ్రైవింగ్ మొడ్స్, రోడ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు పడుతుంది ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ సహాయంతో బ్యాటరీని కేవలం ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ ప్రకారం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ లైఫ్ 70,000 కిలోమీటర్లు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. ఈ వారంటీ మొదటి రిజిస్టర్డ్ హానర్ కోసం మాత్రమే అని గమనించాలీ. స్కూటర్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఈ వారంటీ ప్లాన్ వర్తించదు.
బజాజ్ ఆటో ఏప్రిల్ 13న బుకింగ్ ప్రారంభించిన 48 గంటల్లోనే చెటక్ బుకింగ్స్ ఆపివేసింది. బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కూడా సుమారు రూ .27,000 పెంచింది. ధరల పెరుగుదల తరువాత ఇప్పుడు పూణేలో దీని ధర రూ.1,42,998. ఇంతకుముందు ఈ స్కూటర్ ధరను మార్చి 2021లో రూ .5 వేలకు పెంచడం గమనార్హం. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ ట్రిమ్ ధర పూణేలో రూ .1,42,998 ఎక్స్ షోరూమ్. పూణేలో టాప్-ఎండ్ ప్రీమియం ఎక్స్-షోరూమ్ ధరను రూ .1,44,987 గా ఉంచారు.