బట్టలు చూసి రైతుని అవమానించిన షోరూమ్ వ్యక్తి.. వెంటనే రూ.10 లక్షలతో డిమాండ్.. వీడియో వైరల్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ రైతుకి ఆటోమోబైల్ షోరూం(automobile showroom)లో అవమానానికి గురైన ఘటన సోషల్ మీడియా(social media)లో సంచలనం రేపుతోంది. వాస్తవానికి పికప్ ట్రక్ కొనడానికి షోరూమ్‌కు వెళ్లిన ఓ రైతును అతని దుస్తులు చూసి ఒక సేల్స్‌మెన్(sales man) అవమానించాడని ఆరోపించారు.
దీంతో మనస్తాపానికి గురైన ఆ రైతు అతడిని సవాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయి వెంటనే రూ.10 లక్షలతో తిరిగి వచ్చాడు. కానీ షోరూమ్ అతనికి వాహనం డెలివరీ చేయడంలో అసమర్థతను రుజువు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తరువాత చాలా మంది ప్రజలు ఆ షోరూమ్ వ్యక్తులు వినియోగదారులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
ఒక నివేదిక ప్రకారం గత వారం శుక్రవారం నాడు చిక్కసంద్ర హోబ్లీ పరిధిలోని రామన్‌పాళ్యకు చెందిన కెంపేగౌడ అనే రైతు తన సహచరులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు షోరూమ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ నా బట్టలు, నా పరిస్థితి చూసి నేను డబ్బులిచ్చే పరిస్థితిలో లేను అని అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ దగ్గర 10 రూపాయలు కూడా లేవు కానీ కారు కొంటారా అని అక్కడి ఫీల్డ్ ఆఫీసర్ ఒకరు నాతో అన్నారు. అసలు కారు కొనుక్కోవడానికి వచ్చే వారు ఇలా షోరూమ్ కి రారు ఆని కూడా అన్నారని తెలిపారు.
వెంటనే 10 లక్షలతో షోరూమ్‌కి..
తనని అవమానించడంతో ఆ రైతు నాకోసం మా వాళ్ళు 10 లక్షల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, వెంటనే కారు డెలివరీ చేయాలని సేల్స్‌మెన్‌ని సవాలు చేశాడు. దీనికి షోరూమ్ వారు అరగంటలో నగదు రూపంలో డబ్బులు ఇస్తేనే వెంటనే కారు ఇస్తానని బదులిచ్చారు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చిన 30 నిమిషాల వ్యవధిలో సేల్స్ మాన్ వాహనాన్ని తన ముందు పెట్టడంతో విఫలమయ్యారని కెంపేగౌడ తెలిపారు. మరోవైపు కొన్ని కారణాల వల్ల వాహనాన్ని వెంటనే డెలివరీ ఇవ్వలేకపోయామని షోరూమ్ వారు తెలిపారు.
డెలివరీ ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫోన్
డబ్బులు చెల్లించిన వాహనాన్ని తనికి డెలివరీ చేయకపోవడంతో కోపోద్రిక్తుడైన కెంపేగౌడ అతని సహచరులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే వాహనాని తమకు ఎందుకు డెలివరీ చేయరు అని అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. వాహన్నాని తక్షణమే డెలివరీ ఇవ్వాలని లేదా తమని అవమానించినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులను వారిని ఒప్పించడంతో.. ఇకపై ఈ షోరూం నుంచి మాకు ఎలాంటి వాహనం అక్కర్లేదని, అయితే షోరూం వారు మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి వెళ్లిపోయారు.