మీరు పండగకి కొత్త బైక్ కొంటూన్నారా.. ? ఆగండి.. రెండు సూపర్ బైక్స్ వస్తున్నాయి - ఏంటో తెలుసా?
ఈ వారంలో రెండు కొత్త పవర్ ఫుల్ బైక్‌లు లాంచ్ కానున్నాయి. మీరు హై పర్ఫార్మెన్స్ గల బైక్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. కింద లిస్ట్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అండ్ హీరో బైక్ పేర్లు ఉన్నాయి. రాబోయే ఈ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మీ బడ్జెట్ దాదాపు 2 లక్షలు లేదా మీరు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ విషయం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం లాంచ్ కానున్న బైక్స్ గురించి మీకోసం..
కరిష్మా XMR 210
Hero MotoCorp కరిజ్మా XMR 210ని ఆగస్ట్ 29న అంటే నేడు భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అప్ కమింగ్ బైక్ హీరో ఫ్లాగ్‌షిప్ లైనప్‌కు అతిపెద్ద అదనంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ బైక్ కోసం కరిజ్మా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని డిజిటల్ స్పీడోమీటర్ కూడా మరింత లేటెస్ట్ గా ఉంటుంది.
కరిష్మా XMR 210 cc ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ సిలిండర్ లేఅవుట్‌తో లిక్విడ్-కూల్డ్ యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే దాదాపు 25 బిహెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. గేర్‌బాక్స్ 6-స్పీడ్ యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త జనరల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
కొత్త జనరల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ బైక్ కొన్ని లుక్స్ ఇటీవల విడుదల చేసిన క్లాసిక్ 350ని పోలి ఉండవచ్చు. ఈ 349cc OHC ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ యూనిట్ ద్వారా శక్తిని పొందుతుందని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు.
ఈ ఇంజన్ కి 5-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్ అందించారు. లేటెస్ట్ క్లాసిక్ 350 రెండు గ్రేడల్ ఛాసిస్, 349 cc సింగిల్ సిలిండర్ OHC ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో 6,100 rpm వద్ద 20.2 bhp, 27 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.