అంగవైకల్యం ఉన్న భార్య, పిల్లల కోసం అంటూ.. మెచ్చిన ఆనంద్ మహీంద్రా అద్భుతవకాశం.. వీడియో వైరల్..
దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా "వైకల్యం" ఒక లోపంగా మారనివ్వని ఢిల్లీ వ్యక్తిని చూసి విస్మయానికి గురయ్యాడు. రెండు చేతులు, కాళ్లు అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి వీడియో ఆన్‌లైన్‌లో భారీగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తుంది.
ఇంకా ఇందులో చేతులు, కాళ్ళు వైకల్యం ఉన్న వ్యక్తి ఒక బాటసారుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కనిపిస్తాడు. "స్కూటీ కా ఇంజన్ హై (దీనికి స్కూటీ ఇంజన్ ఉంది)" అని అతను తన మోడీఫైడ్ వాహనం గురించి చెప్పాడు. వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి అభ్యర్థన మేరకు అవయవాలు సరిగ్గా లేనప్పటికీ అతను వాహనాన్ని ఎలా నడపగలడో కూడా చూపించాడు.
‘‘నాకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, వృద్ధుడైన తండ్రి ఉన్నారు.. అందుకే సంపాదన కోసం బయటకు వచ్చాను’’అని పేరు చెప్పని ఆ వ్యక్తి తెలిపాడు. ఐదేళ్లుగా తాను ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు వెల్లడించారు. తనను వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తులు పొగడ్తలతో ముంచెత్తడంతో అతను కేవలం ఒక చిరునవ్వుతో దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా దీనిని ఎక్కడ చిత్రీకరించారో తనకు తెలియదని వీడియో క్లిప్ మొత్తం చూశాక దీనిని ఢిల్లీలో చిత్రీకరించబడిందని స్పష్టమైనప్పటికి ఇతర వాహనాల లైసెన్స్ ప్లేట్‌లను చూడటం ద్వారా మరింత ఖచ్చితంమైందని అన్నారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ "ఈ రోజు నా టైమ్‌లైన్‌లో దీనిని స్వీకరించాను. ఈ వీడియో ఎంత పాతదో లేదా ఎక్కడిదో తెలియదు, కానీ తన వైకల్యాలను ఎదుర్కోవడమే కాకుండా కృతజ్ఞతతో ఉన్న ఈ పెద్దమనిషిని చూసి నేను ఆశ్చర్యపోయాను" అని అన్నారు. అతను తన సహోద్యోగి రామ్ అండ్ మహీంద్రా లాజిస్టిక్స్‌ని ట్యాగ్ చేస్తూ: "రామ్, లాస్ట్ మైల్ డెలివరీ కోసం @Mahindralog_MLL అతన్ని బిజినెస్ అసోసియేట్‌గా చేయగలరా?" అని కోరారు.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి ఈ వీడియోకి ట్విట్టర్‌లో 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంకా ఈ వీడియో ఇతర వెర్షన్‌లు ఇప్పుడు కొన్ని వారాలుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.కామెంట్స్ విభాగంలో ఒక ట్విట్టర్ యూజర్ దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతం చుట్టూ ఈ వ్యక్తిని చూసినట్లు చెప్పారు. మరికొందరు ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపించారు.
జనవరిలో మహీంద్రా లాజిస్టిక్స్ ఆరు నగరాల్లో ఎలక్ట్రిక్ లాస్ట్-మైల్ డెలివరీ సర్వీస్ ని ప్రారంభించింది. 8.5 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న ఆనంద్ మహీంద్రా స్థానిక ప్రతిభకు తరచుగా అభినందిస్తుంటాడు. ఈ నెల ప్రారంభంలో అతను మహారాష్ట్ర వ్యక్తి మోడిఫైడ్ ఫోర్-వీలర్‌ని చూసి ముగ్ధుడై అతనికి మహీంద్రా బొలెరో ఎస్‌యూవిని బహుమతిగా ఇచ్చాడు.