అతితక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు, జస్ట్ 27 నిమిషాల్లో 50 వేల బుకింగ్స్!
చైనాకు చెందిన షియోమీ భారత్‌లో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఇంకా ఇండియాలో అతిపెద్ద మార్కెట్‌ను ఆక్రమించింది. ఇప్పుడు Xiaomi అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ Xiaomi SU7 కారు విడుదలైన 27 నిమిషాల్లోనే 50 వేల కార్లు బుక్ అయ్యాయి.
చైనాకు చెందిన షియోమీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భారత్‌తో సహా పలు దేశాల మొబైల్ మార్కెట్‌ను ఆక్రమించింది. ఇప్పుడు షియోమీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.
అనేక ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్ తర్వాత, Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కొత్త కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ప్రత్యేకంగా, విడుదలైన కేవలం 27 నిమిషాల్లోనే 50,000 కార్లు బుక్ అయ్యాయి. ప్రతి సెకనుకు 5 కంటే ఎక్కువ కార్లు బుక్ కాగా ,దీనికి తోడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇంకా 15 నిమిషాల ఛార్జింగ్‌తో 350 కి.మీ ప్రయాణించవచ్చు.
Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు 663 hp శక్తిని, 838 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంకా టెస్లా వంటి అధునాతన ఫీచర్స్ కూడా ఉన్నాయి.
మొదటి దశలో, ఈ కారు చైనాలో లాంచ్ చేయబడింది. Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు త్వరలో ఇతర దేశాలలో కూడా విడుదల కానుంది.
చైనాలో ఈ కారు ధర 215,900 యువాన్లు ఆంటే భారత రూపాయిలలో సుమారుగా 24.92 లక్షలు. ఈ విభాగంలో లభించే అత్యంత తక్కువ ధర కారు కూడా ఇదే. ఈ కారును షియోమీ డిజైన్ ఇంజనీర్ క్రిస్ బంగ్లీ డిజైన్ చేశారు.