- Home
- Automobile
- ఆటోనోమస్ లెవెల్ -1 ఫీచర్లతో ఎంజి గ్లోస్టర్ కొత్త ఎస్‌యూవి.. లాంచ్ ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి
ఆటోనోమస్ లెవెల్ -1 ఫీచర్లతో ఎంజి గ్లోస్టర్ కొత్త ఎస్‌యూవి.. లాంచ్ ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి
బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ ఎంజి మోటార్ ఇండియా సోమవారం ఎంజి గ్లోస్టర్ ఎస్‌యువి 7-సీటర్ వెర్షన్‌ని ప్రవేశపెట్టింది. ఈ 7-సీటర్ వేరియంట్ టాప్-ఎండ్ సావి ట్రిమ్‌పై ఆధారపడుతుంది. దీని ధర ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవి 6-సీటర్ సావి ట్రిమ్ ధరతో సమానంగా ఉంటుంది.

అంతేకాదు భారతదేశపు మొదటి ఆటోనోమస్ (లెవెల్ 1) ప్రీమియం ఎస్‌యూవితో కలిపి కొత్త ఎంజి గ్లోస్టర్ సావి ట్రిమ్ కొత్త వెర్షన్ గ్లోస్టర్ శ్రేణిని బలోపేతం చేస్తుంది. ఎంజి గ్లోస్టర్ భారతదేశంలో టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్‌లతో పోటీపడుతుంది.
ఇంజన్ అండ్ పవర్
7 సీట్ల ఎంజి గ్లోస్టర్ సావిలో 2.0 ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ 200 పిఎస్ పవర్, 480 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఎంట్రీ లెవల్ సూపర్ అండ్ స్మార్ట్ ట్రిమ్‌లు 2w సిస్టమ్‌తో 2.0-లీటర్ సింగిల్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ఇంజన్ 163 బిహెచ్‌పి పవర్, 375 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్లు
కొత్త గ్లోస్టర్ సావి 7 సీట్ల (2+3+2) కాన్ఫిగరేషన్ ప్రారంభ ధర రూ. 37.28 లక్షలు (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ). అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడిఏఎస్), బోర్గ్ వార్నర్ ట్రాన్స్‌ఫర్ కేస్‌తో పాటు మల్టి డ్రైవింగ్ మోడ్‌లు పొందుతుంది. ఐ-స్మార్ట్ టెక్నాలజీ, 64-కలర్ అంబిఎంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవర్ సీట్ మసాజర్ ఇంకా ఎన్నో ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి.
ఎంజి గ్లోస్టర్ ఇప్పుడు 4 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది - సూపర్, స్మార్ట్, షార్ప్ అండ్ సవి. దీని ధర రూ .29.98 లక్షల నుండి రూ .37.28 లక్షల మధ్య ఉంటుంది. ఇప్పటి వరకు సూపర్, షార్ప్ ట్రిమ్‌లు మాత్రమే 6, 7-సీటర్ లేఅవుట్‌లలో అందుబాటులో ఉన్నాయి. గ్లోస్టర్ సావి ట్రిమ్ తాజాగా 7-సీటర్ వెర్షన్ 2020లో భారతదేశంలో విడుదల చేసిన ఎస్‌యూవికి రిఫ్రెష్ టచ్‌ను జోడించింది.
వారంటీ & ప్యాకేజీలు
ప్రీమియం ఎస్‌యూవి ప్రత్యేకమైన ఇండస్ట్రీ-ఫస్ట్ మై ఎంజి షీల్డ్ ప్యాకేజీతో వస్తుంది, ఇది కస్టమర్ల అవసరాలను తీర్చడంతో పాటు కారు ఓనర్షిప్ అనుభవాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. కస్టమర్‌లకు 200పైగా ఆప్షన్‌ల నుండి అదనపు సర్వీసులు, మెయింటెనెన్స్ ప్యాకేజీలను కస్టమైజ్ చేసే ఆప్షన్‌తో పాటు మై ఎంజి షీల్డ్ 3-3-3 ప్యాకేజీలో మూడేళ్ల/100,000 కిమీ వారంటీ, మూడు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, లేబర్ చార్జెస్ ఉంటాయి.