ఈ రాశులవారికి అహంకారం చాలా ఎక్కువ..!
ముఖ్యంగా దంపతుల మధ్య ఈగో సమస్యలు రాకూడదు. వచ్చాయా..అవి ఎక్కడిదాకా దారితీస్తాయో ఊహించడం కూడా కష్టం.
కొందరికి పొగరు అందంగానే ఉంటుంది. కానీ... దానిని అహంకారం, ఈగో లాగా మార్చుకోకూడదు. ముఖ్యంగా దంపతుల మధ్య ఈగో సమస్యలు రాకూడదు. వచ్చాయా..అవి ఎక్కడిదాకా దారితీస్తాయో ఊహించడం కూడా కష్టం. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారికి ఈగో చాలా ఎక్కువ. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
telugu astrology
1.మేష రాశి..
ఈ రాశి వారు పోటీ , ప్రతిష్టాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందారు. ఎవరైనా కంట్రోల్ చేయడం వీరికి నచ్చదు. ఏ విషయంలోనూ రాజీ పడటం కూడా వీరికి నచ్చదు. చాలా కష్టంగా భావిస్తారు. వీరికి ఈగో కూడా చాలా ఎక్కువ. దాని వల్ల.. తమ భాగస్వామిపై ఎక్కువగా ఆర్డర్లు వేస్తూ ఉంటారు. ఈ రాశివారు తమ భాగస్వామి అవసరాల కంటే.. తమ అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తారు.
telugu astrology
2.వృషభ రాశి..
ఈ రాశివారికి మొండితనం చాలా ఎక్కువ. వారి అహం దెబ్బతిన్నప్పుడు.. తమ భాగస్వామి తమ కంట్రోల్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. వీరికి ఇతరులు చెప్పేది వినడం, ఆ పనులు చేయడం చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటాయి. వీరు ఏ విషయంలోనూ రాజీ పడరు. తమ తప్పులను ఎవరైనా ఎత్తి చూపిస్తే వీరికి నచ్చదు.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశివారికి కూడా ఈగో చాలా ఎక్కువ.ఈ రాశివారు ఎవరు ఏ పని చెప్పినా చేయరు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తమ బాధ్యతలు కూడా పూర్తి చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. ప్రతి విషయంలో తమ భాగస్వామిని నిందిస్తూ ఉంటారు.
telugu astrology
4.వృశ్చిక రాశి..
ఈ రాశివారు అందరిమీదా తామే పెత్తనం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వారి మాట వినకుంటే వీరికి ఈగో దెబ్బ తింటుంది. ఇక తమ భాగస్వామి తమ చెప్పుచేతల్లో ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. వారు తమను ప్రతి నిమిషం ప్రశంసించాలని అనుకుంటారు. ఇగ్నోర్ చేస్తే వీరి అహం దెబ్బ తింటుంది.
telugu astrology
5.సింహ రాశి...
ఈ రాశివారు అందరితోనూ మంచిగానే ఉంటారు. కానీ ఈగో మాత్రం చాలా ఎక్కువ. వీరు ప్రతి నిమిషం తమ భాగస్వామిని అనుమానిస్తూ ఉంటారు. వీరి దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయి. వీరు ఎవరైనా తమకు ద్రోహం చేశారు అని తెలిస్తే... పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టరు.