ఈ రాశివారు బీభత్సమైన అంతర్ముఖులు.. బాబోయ్ తట్టుకోలేం...
తలుపులు బిగించిన గదిలో ఒంటరిగా ఉండడం.. తమతో తాము ఉండడం కొంతమందికి చాలా ఇష్టం. వీరు నలుగురిలో కలవడానికి ఇష్టపడరు. తమ మనసులోది ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. అంతర్ముఖులుగా ఉంటారు. అలాంటి రాశిచక్రం ఉన్నవారెవరో చూడండి.

అంతర్ముఖులు.. కొందరు అంత తొందరగా నలుగురితో కలవరు. మాట్లాడరు. ఏదైనా మాట్లాడాలంటే సిగ్గు పడతారు. చొరవ ఉండదు. అన్నింటికంటే ఎక్కువగా వీరి మనసులో ఏముందో వారికి తప్ప వేరేవారికి తెలియదు. అయితే దీనికి కారణం వారి రాశిచక్రమేనట.. మరి ఆ రాశుల్లో మీరున్నారేమో ఓ సారి చూడండి.
కర్కాటకరాశి (Cancer)
వీరు చాలా ఇన్ సెక్యూర్ గా ఉంటారు. అందుకే ఏ విషయంలోనూ ముందుకు రారు. కొత్తవాళ్లను చూస్తే వీరికి చాలా భయం. సోషల్ గాదరింగ్ లో కలవాలంటే అస్సలు ఇష్టం ఉండదు. తప్పించుకోవడానికి కారణాలు వెతుకుతారు. అంతేకాదు ఎదుటి వ్యక్తుల్ని నమ్మొచ్చు అనే విషయాన్ని అంగీకరించరు.
కన్యారాశి (Virgo)
కన్యారాశివారు ఇంట్లోనుంచి బైటికి వెళ్లాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వీరిని బైటికి తోస్తే కానీ నలుగురిలో కలవరు. ఇల్లే వీరికి స్వర్గం.. ఇంట్లో ఒంటరిగా ఉండడమే సంతోషం. ఏ పని చేసినా తమంతట తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇతరుల జోక్యం అస్సలు ఇష్టం ఉండదు.
మకరరాశి (Capricorn)
వారు తమ పనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని.. తమను తాము సపరేట్ గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మకరరాశి వారు తమదైన ప్రపంచంలోనే నిమగ్నమై ఉంటారు. వీరు వర్క్‌హాలిక్‌లు కూడా. సామాజిక కార్యకలాపాలలో పెద్దగా జోక్యం చేసుకోరు. కారణం అది టైం వేస్ట్ అనుకుంటారు.
Pisces Zodiac
మీనరాశి (Pisces)
వారు అసౌకర్యంగా భావించే పరిస్థితిలో ఉండటం గురించి చాలా ఆందోళన పడతారు. వీరు ఇతరులను విశ్వసించడం చాలా కష్టం. అందుకే వారు చాలా సిగ్గుగా, అంతర్ముఖంగా, ఇబ్బందికరంగా కనిపిస్తారు.