జరగబోయేదేంటో ఈ రాశులవారికి ముందే తెలుస్తుంది..!
వారు చెప్పినట్లే జరుగుతుంది కూడా. అలా చెప్పగలగడానికి వారికి భవిష్యత్తు తెలుసు అని కాదు కానీ.. వారిలో కొంత ఊహా జ్ఞానం ఉంటుదట. దాని వల్ల.. వారు కొన్ని కొన్ని విషయాలను ఊహించి చెప్పగలుగుతారు.
కొంత మందికి జరగబోయేదేంటో ముందే తెలిసిపోతుంది. అంటే.. అన్ని విషయాలు కాదు.. కానీ.. ఈ రోజు వర్షం పడుతుంది.. ఈ రోజు మ్యాచ్ ఈ జట్టు గెలుస్తుంది.. ఇలా కొందరు ముందే ఊహించేస్తుంటారు. వారు చెప్పినట్లే జరుగుతుంది కూడా. అలా చెప్పగలగడానికి వారికి భవిష్యత్తు తెలుసు అని కాదు కానీ.. వారిలో కొంత ఊహా జ్ఞానం ఉంటుదట. దాని వల్ల.. వారు కొన్ని కొన్ని విషయాలను ఊహించి చెప్పగలుగుతారు. అలా చెప్పగలిగేవారు ఎవరు అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చు. కాబట్టి.. ఆ శక్తి ఉన్న రాశులేంటో ఓసారి చూసేద్దాం..
1.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని వెంటనే ముందే పసిగట్టగలరట. దానికి తగ్గట్టుగానే వారి బుర్రకి, మనసుకి సర్ధిచెప్పుకుంటారట. ఎవరైనా వీరి దగ్గర అబద్ధం చెప్పాలని ప్రయత్నించినా.. వీరు వెంటనే పసిగట్టేయగలరట. కాబట్టి వీరిని మోసం చేయడం అంత సులభం కాదు. వీరి దగ్గర అప్రమత్తంగా ఉండాలి. వీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు.
2.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితం. ఎమోషన్స్, ఫీలింగ్స్ కి ఎక్కువ విలువనిస్తారు. వీరు అందరితోనూ మాట్లాడటానికి సముఖత చూపిస్తుంటారు. అందరిలోనూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరైనా బాధల్లో ఉంటే వెంటనే వీరికి అర్థమౌతుంది. వారి సమస్యలను తీర్చడానికి సహాయం చేస్తారు.
3.కన్య రాశి..
ఈ రాశివారు తమ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తూ ఉంటారు. వీరిని చూసి ఎప్పుడూ పక్కవారు ఆశ్చర్యపోతుంటారు. కానీ కన్య రాశివారి చూపు నుంచి చిన్న వస్తువు కూడా పోదు. ప్రతి చిన్న విషయాన్ని వీరు గమనిస్తారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. అందరూ మెచ్చే నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుంటారు.
4.తుల రాశి..
ఈ రాశివారు తమ చుట్టూ ఏం జరుగుతోంది అనే విషయాన్ని వెంటనే పసిగట్టగలరు. ఎలాంటి పరిస్థితినైనా వీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎదుటి వారి మనసులో ఏముందో కనిపెట్టగల సత్తా వీరికి ఎక్కువ అని చెప్పొచ్చు. చూడని విషయాన్ని కూడా వీరు సులభంగా అర్థం చేసుకోగలరు. ప్రతి విషయాన్ని బాగా విశ్లేషిస్తూ ఉంటారు.
5.మీన రాశి..
ఈ రాశివారి ఆలోచనలన్నీ చాలా సృజనాత్మకంగా.. చాలా సహజంగా ఉంటాయి. ఈ రాశివారు జరగపోయే దానిని ముందుగానే పసిగట్గగలరు. చాలా ఎక్కువ విషయాలు వీరికి ముందుగా నే అర్థమైపోతూ ఉంటాయి. వీరి ఆలోచనలన్నీ చాలా సహజంగా ఉంటాయి.