ఈ రాశుల అమ్మాయిలు డ్రామా క్వీన్ లు..!
వీళ్లేంటి ప్రతిదానికీ.. ఇంతలా అతి చేస్తున్నారు అనే సందేహం మీకు కలుగుతూనే ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులు కూడా అంతేనట.. ప్రతి విషయంలోనూ అతి చేస్తూ ఉంటారట. వీరిని డ్రామా క్వీన్స్ అని కూడా అనొచ్చు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

astrology
ప్రతి విషయానికీ డ్రామా చేయడం చేసేవారికి ఎలా ఉంటుందో తెలీదు కానీ.. చూసేవారికి మాత్ర్ం కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మితిమీరిన నాటకీయంగా ఉండేవారిని ఎదుర్కోవాలంటే.. చాలా ఓపిక అవసరం. వీళ్లేంటి ప్రతిదానికీ.. ఇంతలా అతి చేస్తున్నారు అనే సందేహం మీకు కలుగుతూనే ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులు కూడా అంతేనట.. ప్రతి విషయంలోనూ అతి చేస్తూ ఉంటారట. వీరిని డ్రామా క్వీన్స్ అని కూడా అనొచ్చు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..
1.ధనస్సు రాశి..
ఈ రాశివారిని డ్రామా క్వీన్ గా చెప్పొచ్చు. ఈ రాశివారు తమ అభిప్రాయాలను తెలియజేయడంలో చాలా ముక్కు సూటిగా ఉంటారు. కానీ.. దానిలోనూ.. డ్రామా జోడించకుండా ఉండరు. చిన్న విషయాన్ని కూడా అతిగా చేయడం వీరి వల్ల మాత్రమే అవుతుంది. ఒక్కోసారి చిన్న గొడవను కూడా చాలా పెద్దదిగా చేయడంలో వీరు ముందుంటారు.
2.వృశ్చిక రాశి..
వారు ఎదుర్కొంటున్న సమస్యలు , పోరాటాల గురించి వారు చాలా డ్రమటిక్ గా ఉంటారు.. చాలా ఎమోషనల్‌గా ఉన్నప్పుడు, వారు చాలా దూకుడుగా ఉన్నప్పుడు కూడా వీరు వీరిలోని నాటకీయతను బయటపెడతారు. వారు కూడా చాలా వాస్తవాలను అతిశయోక్తి చేస్తారు.
3.కర్కాటక రాశి..
తమ భావాలను వ్యక్తపరిచే విషయంలో చాలా మూడీగా ఉంటారు. వారు ఒక క్షణం బాగానే ప్రవర్తిస్తారు కానీ తర్వాత, అవతలి వ్యక్తి తమ భావోద్వేగాలకు సరిగ్గా స్పందించనప్పుడు వారు గొడవ సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కర్కాటక రాశివారు తిరస్కరణకు బాగా స్పందించరు. అప్పుడు తమలోని డ్రామాను బయటపెడతారు.
4.కుంభ రాశి..
సాధారణంగా, కుంభరాశులు ఒక మూలలో ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు కోపంగా ఉన్నప్పుడు మాత్రం నాటకీయ పరిస్థితిని సృష్టిస్తారు. కోపం వస్తే మాత్రం.. చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు.. ఎందుకింత డ్రామా చేస్తున్నారో చూసేవారికి ఎవరికీ అర్థం కాదు.
5.సింహ రాశి..
ఈ రాశివారు నాటక రంగానికి రాణులు. వారు ఎల్లప్పుడూ తమ కోసం స్పాట్‌లైట్‌ను కోరుకుంటారు ఎందుకంటే వారు ఉత్తమమైనవారని వారు విశ్వసిస్తారు. వారు చాలా నాటకీయంగా ఉంటారు అహంకారం చాలా ఎక్కువ. అహంతో అతిగా పనులు చేస్తారు. అంత నాటకీయంగా ఉన్నా.. ఇతరులపట్ల దయగా ఉంటారు.