MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • పర్ఫెక్ట్ హాజ్బెండ్ కావాలా? ఈ రాశులవారైతే బెటర్.. ఓ లుక్కేయండి...

పర్ఫెక్ట్ హాజ్బెండ్ కావాలా? ఈ రాశులవారైతే బెటర్.. ఓ లుక్కేయండి...

భర్త అంటే భార్యను ప్రేమగా చూసుకోవాలి.. పిల్లలతో ఆప్యాయంగా ఉండాలి. కుటుంబ భారాన్ని మోయాలి. చేసే ప్రతీ పనిలో తన కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు తెలియాలి. కొంతమంది పురుషులు పూర్తి స్థాయిలో ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని ఉంటారు. 

Bukka Sumabala | Published : May 09 2023, 02:23 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

కొంతమంది పురుషులు... వారు చేసే ప్రతి పని వారిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది. వారు భాగస్వామిని ప్రేమించే తీరు, శ్రద్ధ వహించే విధానం నిజంగా ప్రశంసనీయంగా ఉంటుంది. తమ భాగస్వామి పట్ల సహనం, సానుభూతి, పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అలాంటి వారు పూర్తి హజ్బెండ్ మెటీరియల్. అయితే, ఇదంతా వారి రాశిచక్రంవల్లే సాధ్యం అంటుంది జ్యోతిష్య శాస్త్రం. మరి ఆ పన్నెండు రాశుల్లో ఆ రాశులు ఏవో చూడండి.. 

27
Asianet Image

కర్కాటకం
కర్కాటక రాశివారు వారు తమ భాగస్వాముల పట్ల శ్రద్ధ చూపించడం.. జాగ్రత్తగా చూసుకోగల వ్యక్తిత్వాలకు ప్రసిద్ధి చెందారు. వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తన ప్రియమైనవారికి నమ్మకంగా ఉంటారు. ఇల్లు తప్ప వారికి వేరే ఏవీ పట్టవు.  కర్కాటక రాశి భర్త అంటే భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచే వ్యక్తి అని అర్థం.

37
Asianet Image

కన్య
కన్యా రాశివారు తరచుగా ఆధారపడదగినవారిగా, ఆచరణాత్మక భాగస్వాములుగా కనిపిస్తారు. వారు కష్టపడి పనిచేస్తారు. భాగస్వాముల విషయాల పట్ల కూడా అంతే శ్రద్ధగా పనిచేస్తారు. భర్తలుగా, కన్య రాశి వారు తమ భాగస్వామి అవసరాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వారిని సంతోషపెట్టడానికి తాము కెరీర్ లో పైపైకి వెళ్లడానికి ఇష్టపడతారు.

47
Asianet Image

తులారాశి
తులారాశి వారు డిప్లమాటిక్ గా ఉంటారు. చాలా నిజాయితీ అయిన మనుషులు. వారు తమ బంధాలలో సమతుల్యత ఉండేలా చూసుకుంటారు. సమరస్యాంగా సాగాలని కోరుకుంటారు. తమ బంధానికి ఇవి ఎంతో విలువైనవిగా భావిస్తారు. రాజీ పడడంతో, తాననుకున్నది సరిగ్గా కమ్యూనికేట్ చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు. తులరాశివారు సాధారణంగా సామరస్యపూర్వకమైన గృహ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పనులకే తమ మద్దతునిస్తారు. భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు.

57
Asianet Image

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఉద్వేగభరితంగా ఉంటారు.  సంబంధాన్ని చాలా సీరియస్ గా తీసుకునే భాగస్వాములుగా ప్రసిద్ధి చెందారు. తమ బంధం భావోద్వేగ సాన్నిహిత్యంతో కూడుకుని ఉండాలని అనుకుంటారు. దానికి విలువ ఇస్తారు. వారి సంబంధాలకు బాగా కట్టుబడి ఉంటారు. తమ భాగస్వాములకు అత్యంత విశ్వాసపాత్రంగా, రక్షణగా ఉంటారు. తమ భాగస్వాములకు మద్దతు ఇవ్వడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

67
Asianet Image

మీనరాశి
మీనరాశి వారు సానుభూతిగల భర్తలు. తమ భాగస్వామి అవసరాల విషయంలో సహజంగా, సున్నితంగా ఆలోచిస్తారు. భావోద్వేగపరమైన మద్దతును అందించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు మంచి ప్రేమగల వ్యక్తులు. శృంగారంలో కూడా మంచి భాగస్వాములు. తమ ప్రియమైనవారి మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారు.

77
Asianet Image

వీరు కాకుండా.. పెళ్లి అంటేనే చిరాకు తెప్పించే రాశులెవరంటే... 
మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకరం,  కుంభరాశి వారు వివాహం విషయంలో చాలా సందేహాస్పదంగా ఉంటారు. వారు వివాహంలో చాలా గందరగోళానికి గురవుతారు. వీరికి పరిపూర్ణ భాగస్వామిగా ఎలా ప్రవర్తించాలో తెలియదు!

Bukka Sumabala
About the Author
Bukka Sumabala
జీవనశైలి
 
Recommended Stories
Top Stories