Zodiac signs: ఈ రాశుల మాటలు నమ్మితే మీ పని గోవిందే..!
తమ అబద్ధాలతో అందరినీ ప్రభావితం కూడా చేస్తారు. అదే నిజం అని కూడా నమ్మించగలరు. జోతిష్యశాస్త్రం ప్రకారం అబద్ధాలు చెప్పడంలో దిట్ట అయిన రాశులేంటో ఓసారి చూద్దాం...

lies
మన చుట్టూ ఉండేవారిలో చాలా మంది తరచూ అబద్దాలు చెబుతూ ఉంటారు. అయితే... కొందరు అబద్దం చెబితే వెంటనే దొరికిపోతారు. కానీ, కొందరు మాత్రం అలాకాదు. వారు అబద్దం చెబితే అతికినట్లు ఉంది. వారు చెప్పింది అబద్దం అని ఎవరూ కనీసం కనిపెట్టలేరు కూడా. అంత అందంగా చెప్పేస్తారు. తమ అబద్ధాలతో అందరినీ ప్రభావితం కూడా చేస్తారు. అదే నిజం అని కూడా నమ్మించగలరు. జోతిష్యశాస్త్రం ప్రకారం అబద్ధాలు చెప్పడంలో దిట్ట అయిన రాశులేంటో ఓసారి చూద్దాం...
telugu astrology
1.మిథున రాశి...
మిథున రాశివారు చాలా చురుకుగా ఉంటారు. ఆ రాశివారు చాలా తెలివైన వారు కూడా. అయితే.. అబద్ధాలు చెప్పడంలో వీరు చాలా దిట్ట. ఎంతలా అంటే.. వారు తమ మాటలతో ఇతరులను కూడా సులభంగా ప్రభావితం చేయగలరట. అయితే.. వారికి అబద్ధాలు చెప్పే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. తమ స్వార్థం కోసం, ఇతరులను సంతోషపెట్టడం కోసం చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు.
telugu astrology
తుల రాశి
తుల రాశి వారు సాధారణంగా ప్రశాంతంగా, న్యాయంగా ఉంటారు. అయితే, తమ బలహీనతలను దాచుకోవడానికి లేదా ఇతరుల మనసు గెలుచుకోవడానికి అబద్ధాలను ఆశ్రయించవచ్చు. వారు అబద్ధాలు చెప్పినా ఎవరూ పట్టుకోలేనంత చాకచక్యంగా మాట్లాడతారు. వీరి అబద్ధాలను అందరూ ఈజీగా నమ్మేస్తారు.
telugu astrology
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు సాధారణంగా చాలా మర్మంగా, గోప్యంగా ఉంటారు. తమ వ్యక్తిగత జీవితం, ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే, వారు తరచుగా అబద్ధాలను ఆశ్రయిస్తారు. తమ భావోద్వేగాలు, అనుభూతులను దాచుకోవడానికి అబద్ధాలు చెప్పవచ్చు.
telugu astrology
కుంభ రాశి
కుంభ రాశి వారు సాధారణంగా చాలా స్వతంత్రంగా, ఆధునిక ఆలోచనా ధోరణితో ఉంటారు. సమాజ నియమాలు, సంప్రదాయాలను అతిక్రమించడానికి ఇష్టపడతారు. తమ లక్ష్యాలను సాధించడానికి లేదా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి అబద్ధాలు చెప్పవచ్చు.
ఈ రాశుల వారితో పాటు, ఇతర రాశుల వారు కూడా అబద్ధాలు చెప్పవచ్చు. అయితే, ఈ రాశుల వారిలో అబద్ధాలు చెప్పే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది.