Zodiac signs: ఈ రాశులతో శత్రుత్వం పెట్టుకోకండి.. తట్టుకోలేరు..!
కొందరు మనకు తెలిసిన శత్రువులు ఉంటే.. మరి కొందరికి తెలీకుండానే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. అయితే... కొందరితో మాత్రం అస్సలు శత్రుత్వం పెంచుకోకూడదట.

zodiac signs
ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులు లైఫ్ లో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... మనకు స్నేహితులు ఉన్నట్లే.. శత్రువులు కూడా ఉంటారు. కొందరు మనకు తెలిసిన శత్రువులు ఉంటే.. మరి కొందరికి తెలీకుండానే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. అయితే... కొందరితో మాత్రం అస్సలు శత్రుత్వం పెంచుకోకూడదట. జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులతో గొడవలు లాంటివి పడకుండా ఉంటేనే సంతోషంగా ఉంటారు. వారు చాలా ప్రమాదం. మరి, ఆ రాశులేంటో తెలుసుకుందాం..
1.మేష రాశి...
మేష రాశివారు చాలా ధైర్యవంతులు. చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.. వీరితో ఎవరూ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎందుకంటే... వీరితో శత్రుత్వం మీకే ప్రమాదం. ప్రమాదకరమైన శత్రువుల్లో ఈ రాశివారు ముందుంటారు. స్నేహితులుగా ఉన్నంత వరకు ఈ రాశివారు ఎంత మంచిగా ఉంటారో.. ఒక్కసారి శత్రుత్వం పెంచుకుంటే మాత్రం అంత భయంకరంగా ఉంటారు. వీరికి కోపం వస్తే.. ఏం మాట్లాడతారో కూడా తెలీదు. వీరితో గొడవ పడడం కంటే.. ప్రశాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది.
2.వృశ్చిక రాశి...
మేష రాశి లాగానే... వృశ్చిక రాశి వారికి కూడా కోపం చాలా ఎక్కువ. వీరు పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ... వారి మనసులో మాత్రం ఎవరికీ తెలీకుండా శత్రుత్వం పెంచుకుంటారు. వీరు ఎవరినైనా నమ్మితే.. వారితో మంచి స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే.. జీవితాంతం అసహ్యించుకుంటారు. ప్రతీకారం తీర్చుకునేదాకా వదిలిపెట్టరు. పొరపాటున కూడా క్షమించరు. అందుకే.. ఈ రాశివారితో గొడవలు పడటం, వారిని మానసికంగా బాధ పెట్టడం లాంటి పనులు అస్సలు చేయకూడదు.
3.మకర రాశి...
మకర రాశి వారికి కూడా కోపం చాలా ఎక్కువ. వీరు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసి చూస్తారు. వారు చాలా దూకుడుగా ఉంటారు. వారు తమ పనిని సరిగ్గా చేయాలనుకుంటారు. పరిస్థితికి అనుగుణంగా వారి ప్రవర్తనను వీరు మార్చుకోలేరు. ఎవరైనా సమస్య కలిగిస్తే, వారు సులభంగా వదిలిపెట్టరు. వారు సమస్య గురించి మళ్లీ మళ్లీ మాట్లాడతారు. రోజుల తరబడి పోరాడుతారు. మాటలతో బాధపెట్టడం వీరికి మాత్రమే సాధ్యం. ఎప్పుడు ఎలా దాడి చేస్తారో ఎవరూ ఊహించలేరు.
4.కుంభ రాశి...
కుంభ రాశి వారిని శని పాలిస్తాడు. వారు చాలా క్రమశిక్షణ , ఆలోచనాపరులు. వారు ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. వారు తరచుగా ఆధిపత్యం చెలాయిస్తారు. ఇది వారి చుట్టూ ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. ఎవరైనా తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి లేదా శత్రుత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే వారు తమ శత్రువులను సులభంగా వదిలిపెట్టరు. వారు సమస్యను చాలా పెద్దదిగా చేస్తారు. అందుకే.. ఈ రాశి వారితో గొడవలు పడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.