- Home
- Astrology
- Zodiac sign: కొన్ని రోజులు ఆగితే చాలు.. ఫిబ్రవరి 17 నుంచి ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు
Zodiac sign: కొన్ని రోజులు ఆగితే చాలు.. ఫిబ్రవరి 17 నుంచి ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు
Zodiac sign: 2026లో తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో సంభవించనుంది. ఖగోళ శాస్త్ర పరంగా ఇది సహజ సంఘటన అయినా, వేద జ్యోతిషం ప్రకారం దీని ప్రభావం రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. కుంభ రాశిలో జరగనున్న ఈ గ్రహణంతో కొన్ని రాశులకు కలిసిరానుంది.

తొలి సూర్యగ్రహణం తేదీ, సమయం వివరాలు
ఫిబ్రవరి 17, 2026 మంగళవారం ఫాల్గుణ అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం జరుగుతుంది. గ్రహణం ప్రారంభం సాయంత్రం 05:26 గంటలకు కాగా ముగింపు రాత్రి 07:57 గంటలకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కుంభ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల ప్రత్యేక రాశులకు అనుకూల ఫలితాలు కనిపించనున్నాయి.
మేష రాశి: అదృష్టం తలుపు తట్టే సమయం
ఈ సూర్యగ్రహణం మేష రాశివారికి కీలక మలుపు తీసుకురానుంది. ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ముందడుగు వేయడానికి ఇది మంచి కాలం. కొత్త పనులు మొదలుపెడితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్యం పెరుగుతుంది.
వృషభ రాశి: కెరీర్‌లో స్పష్టమైన పురోగతి
వృషభ రాశివారికి ఈ గ్రహణ కాలం ఉత్సాహాన్ని ఇస్తుంది. పని ప్రదేశంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి దశ. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
మిథున రాశి వారికి ఆదాయం
మిథున రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ మద్ధతు బలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదుగుదల కనిపిస్తుంది.
కర్కాటక రాశి వారికి లాభాలు
కర్కాటక రాశి వారికి అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోచన ఫలించవచ్చు. మొత్తంమీద 2026లో సంభవించే తొలి సూర్యగ్రహణం కుంభ రాశిలో జరగడం వల్ల మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల వారికి విజయం, పురోగతి, ఆర్థిక స్థిరత్వం దిశగా మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

