ఈ రాశుల కాంబినేషన్ మామూలుగా ఉండదు.. ది బెస్ట్ అంతే..!
వారి సోల్స్ మధ్య కనెక్షన్ కూడా చాలా బాగుంటుందట. వారి మధ్య ప్రేమ కూడా అంతే అర్థవంతంగా ఉంటుందట. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారట. అలాంటి రాశుల కాంబినేషన్ ఇప్పుడు చూద్దాం..

SEX
అదేంటో తెలీదు.. కొందరితో కలిసిన కొద్ది రోజులకే.... ఎన్నో సంవత్సరాల బంధంలా మారుతుంది. కానీ.. కొందరితో.. ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నా... కెనక్షనే కుదరదు. కాగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల కాంబినేషన్ చాలా బాగుంటుందట. ఆ రెండు రాశుల మధ్య కనెక్షన్ అదిరిపోతుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా.
ఈ రాశుల కాంబినేషన్.. అన్ని విషయాల్లో చాలా బాగుంటుందట. వారి మధ్య జన్మజన్మల అనుబంధం ఉందా అన్నట్లుగా ఉంటుందట. వారి సోల్స్ మధ్య కనెక్షన్ కూడా చాలా బాగుంటుందట. వారి మధ్య ప్రేమ కూడా అంతే అర్థవంతంగా ఉంటుందట. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారట. అలాంటి రాశుల కాంబినేషన్ ఇప్పుడు చూద్దాం..
1.మీన రాశి- కర్కాటక రాశి..
మీన రాశి, కర్కాటక రాశుల కాంబినేషన్ అదిరిపోతుంది. వీరు.. ఒకరిని మరొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ రెండు రాశులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. మనస్థత్వాలు కూడా ఒకేలా ఉంటాయి. అందుకే.. వెంటనే కెనక్షన్ వచ్చేస్తుంది. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అండగా నిలుస్తారు. అందుకే ఈ రాశుల కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు.
2.మేష రాశి- ధనస్సు రాశి..
ఈ రెండు రాశుల వారు.. ప్రతి విషయంలోనూ చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. ఇద్దరికీ.. అడ్వెంచర్స్ చేయడం ఇష్టం.. కొత్త దనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎదైనా కొత్తగా చేయాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయి. అందుకే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు.
3.కన్య రాశి- వృషభ రాశి..
కన్య రాశి.. వృషభ రాశి.. ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు రాశుల వారు చాలా ఐడియాలిస్టిక్ గా ఉంటారు. ఒకరినొకరు డీప్ గా అర్థం చేసుకుంటారు. నోరు తెరిచి చెప్పక్కర్లేదు. ఏం కావాలో వీరికి అర్థమైపోతుంది.
4.తుల- వృశ్చిక రాశి..
ఈ రెండు రాశుల మధ్య కనెక్షన్ చూస్తే ఎవరైనా ఈర్ష్య పడాల్సిందే. అంత బాగుంటుంది. వీరి మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ.. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు రాశుల వారు.. ఒకరికొకరు.. వారి కంపెనీని ఇష్టపడతారు.
5.కుంభ రాశి- మిథున రాశి..
ఈ రెండు రాశులు.. జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలరు. ప్రతి విషయంలోనూ ఒకరికి మరొకరు అండగా నిలుస్తారు. రిలేషన్ షిప్ లోనూ, కెరీర్ విషయంలోనూ.. ఏదైనా విషయంలో నిర్ణయం తీసకునేటప్పుడైనా.. వీరి మధ్య అండర్ స్టాండింగ్ అదిరిపోతుంది.
6.సింహ రాశి- తుల రాశి..
ఈ రెండు రాశులు.. ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. ఎదుటివారికి కూడా అంతే పంచుతారు. అయితే.. వీరు.. వీరికి తప్ప.. ఇతరులకు ఎక్కువగా ప్రేమను పంచలేరు. వీరి కాంబినేషన్ కూడా బాగుంటుంది.