Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో పెట్టుకుంటే మీ పని అయిపోయినట్లే..!
కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారు. చాలా వ్యూహాత్మకంగా ఉంటారు. వారి మనసులను అర్థం చేసుకోవడం అంత సులువేమీ కాదు. వారి పని విధానం, వారి ఆలోచనా స్థాయి గొప్పగా ఉంటుంది.

Birth date
న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి జన్మ సంఖ్య.. వారు పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, వారి వ్యక్తిత్వం, ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఆలోచినా విధానం అన్నీ తెలుసుకోవచ్చు. అయితే.... ఈ న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారు. చాలా వ్యూహాత్మకంగా ఉంటారు. వారి మనసులను అర్థం చేసుకోవడం అంత సులువేమీ కాదు. వారి పని విధానం, వారి ఆలోచనా స్థాయి గొప్పగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉండేవారిని కూడా చాలా ప్రభావితం చేయగలరు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో పెట్టకుంటే.. మీ పని అయిపోతుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. చాలా నమ్మకంగా కూడా ఉంటారు. ఎలాంటి పరిస్థితి ని ఎలా మేనేజ్ చేయాలో ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలకు బాగా తెలుసు. తమ చుట్టూ ఎలాంటివారు ఉండాలి..? ఎలాంటి వారు అసవరం లేదో వీరికి బాగా తెలుసు. వారి వ్యక్తిత్వం, వారు మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. వీరి స్వరం వింటే వారి మనసు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అయితే.. వీరి తెలివి తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎవరైనా వీరిని చీట్ చేయాలని చూసినా వీరు మడతపెట్టేస్తారు. వీరితో పెట్టుకొని తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.
నెంబర్ 6..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా చాకచక్యంగా ఉంటారు. వీరిపై శుక్ర గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు అందంగా ఉండటమే కాకుండా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. మంచివారితో మంచిగానూ, చెడ్డవారితో చెడుగానూ ప్రవర్తించడం వీరితో మాత్రమే సాధ్యం.తమ మాటలతో ఎవరినైనా మెస్మరైజ్ చేయగలరు. ఎదుటి వ్యక్తిని తమ మాటలతో చాలా సులువుగా ఎలా ఒప్పించాలో వీరికి బాగా తెలుస్తుంది. ఎదుటివారితో తమ పని ఎలా చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు. చాకచక్యంగా అన్నీ పనులు వీరు బాగా చేయించుకోగలరు.
నెంబర్ 7...
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు..చాలా తెలివైన వారు. తొందరగా బయటకు మాట్లాడరు. చాలా అంతర్మఖులు. మనసులో మాట తొందరగా బయటపెట్టరు. వారి ఆలోచనా విధానం ఇతరుల వ్యక్తుల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారు తమ నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు, వారు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తారు. ఎదుటి వ్యక్తి ఉద్దేశాలను ముందుగానే గ్రహించగలరు. అందుకే వారి నుండి ఏదైనా దాచడం చాలా కష్టం. ఇతరుల మనసులోని విషయాలను కూడా ఈజీగా పసిగట్టేయగలరు. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.