Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇంటికి లక్ష్మీ దేవిలా అదృష్టాన్ని తెస్తారు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన అమ్మాయిలు లక్ష్మీదేవిలా అదృష్టాన్ని తెస్తారు. వారు ఇంటికి ఆనందం, శ్రేయస్సు తెస్తారు.

పుట్టిన తేదీ...
న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విధి, జీవితం, కెరీర్ , ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీ దేవిలా ఇంటికి ఆనందం, శ్రేయస్సు తెస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం....
నెంబర్ 2...
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన అమ్మాయిలంతా నెంబర్ 2 కిందకు వస్తారు. వీరిని చంద్రుడు పాలిస్తూ ఉంటాడు. ఈ గ్రహ ప్రభావం కారణంగా... వీరు చాలా మృదువుగా, ఎమోషనల్ గా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా శాంతియుతంగా, ప్రేమగా ఉంటారు. వారు తమ కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. వీరు ఎక్కడ ఉంటే.. అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది. వీరి కారణంగా.. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరు తెలివితేటలతో ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కోగలరు. వీరు ఇంట్లో తిరుగుతూ ఉంటే.. లక్ష్మీదేవి నడుస్తున్నట్లే ఉంటుంది.
నెంబర్ 6...
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన అమ్మాయిలంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిని శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. అందుకే, వీరు చూడటానికి అందంగా ఉంటారు. వీరిలో చాలా టాలెంట్ ఎక్కువ. కళా రంగాల్లో దూసుకుపోతారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. వారు తమ ఇళ్లను అలంకరించడమే కాకుండా, ఇంటికి సంపద, ఆనందాన్ని తెస్తారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.
నెంబర్ 9..
ఏ నెలలోనైనా 9, 18 లేదా 27 తేదీలలో జన్మించిన అమ్మాయిలు నెంబర్ 9 కిందకు వస్తారు. వారి పాలక గ్రహం అంగారక గ్రహం. దీని కారణంగా ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కష్టపడి జీవిస్తారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. వీరు ఎక్కడ ఉంటే అక్కడ నిరాశ అనేది ఉండదు. అందరినీ సంతోషంగా ఉంచాలనే అనుకుంటారు. ప్రతి కష్టంలోనూ తమ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తారు. ఇంటికి గౌరవాన్ని తీసుకువస్తారు. వీరి కారణంగా ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.