Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారంలో బాగా రాణించగలరు..!
Birth Date: న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మనకు ఉద్యోగం, వ్యాపారం ఏది సూట్ అవుతుందో కూడా.. మనం పుట్టిన తేదీని ఆధారం చేసుకొని కూడా తెలుసుకోవచ్చని మీకు తెలుసా?

Birth Date
న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ మన వ్యక్తిత్వాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా, ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి? ఏ కెరీర్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుందో కూడా తెలుసుకోవచ్చు. కొందరు ఉద్యోగాల్లో బాగా రాణిస్తే, మరి కొందరు వ్యాపారాల్లో తమ సత్తా చాటగలరు. మరి, మీరు పుట్టిన తేదీ ప్రకారం.. ఎవరికి వ్యాపారాలు బాగా కలిసొస్తాయో ఇప్పుడు చూద్దాం...
నెంబర్ 1...
న్యూమరాలజీ ప్రకారం 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లగలరు. వీరికి ఆత్మ విశ్వాసం కూడా చాలా ఎక్కువ. కోరుకున్నది సాధించాలనే పట్టుదల వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో రాణించగలరు. వీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో బాగా రాణించగలరు.
నెంబర్ 5...
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వీరికి సృజనాత్మకత చాలా ఎక్కువ. చాలా వేగంగా ఆలోచించగలరు. వీరు వ్యాపార ప్రపంచంలో చాలా బాగా రాణించగలరు. వీరు తమ మాటల మాయాజాలంతో అందరినీ ఆకట్టుకుంటారు.
నెంబర్ 6...
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. వీరు చాలా అందంగా ఉంటారు. తమ మాటలతో, అందంతో అందరినీ ఆకర్షించగలరు. వీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా.. అందులో విజయం సాధించగలరు. డబ్బు ఎక్కువగా కూడా సంపాదించగలరు.
నెంబర్ 9...
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరిపై కుజుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ధైర్యం చాలా ఎక్కువ. ఓటమి ఎదురైనా తట్టుకొని నిలపడతారు. కష్టాలకు భయపడరు. నష్టాలు ఎదురైనా తట్టుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలరు.