కలలో ఇవి కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..
స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు పడే కలలు మనకు భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ ఘటనల గురించి తెలియజేస్తాయి. అంతేకాదు కొన్ని కలలు మనకు హెచ్చరికలా కూడా పనిచేస్తాయి. అందుకే ఈ రోజు మనం కలలో బల్లిని చంపినట్టు కల వస్తే ఏం అర్థమొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కలలు
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనం కలే ప్రతి కలకూ ఏదో ఒక అర్థం ఉంటుంది. కలలు మనకు భవిష్యత్తులో జరగబోయే శుభ, అశుభ సంఘటనల గురించి సమాచారమిస్తాయని జ్యోతిష్యులు చెప్తారు. కొన్ని కలలు మనకు మంచి జరిగే విషయాలను చెప్తే.. ఇంకొన్ని కలలు మనకు జరగబోయే చెడును గురించి చెప్తాయి. అంటే కొన్ని కలలు మనకు హెచ్చరికల్లా పనిచేస్తాయన్న మాట.
Lizard
అటువంటి సందర్భంలో మనం ఈ రోజు కలలో బల్లులకు సంబంధిన కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం.. అసలు కలలో బల్లులు కనిపిస్తే మంచిదా? కాదా? వంటి విషయాలను తెలుసుకుందాం పదండి.
కలలు
కలలో బల్లిని చంపినట్టు..
కొంతమందికి కలలో బల్లి కనిపించడమే కాకుండా.. వాటిని చంపినట్టు కూడా కలలు పడుతూ ఉంటాయి. కానీ ఇది శుభ సంకేతం కాదు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇది శుభ కల.ఇలాంటి కల మీకు పడితే మీ జీవితంలో మీరు ఎన్నో ఇబ్బందులు పడబోతున్నారని అర్థం వస్తుంది.
కలలు
కలలో బల్లి బిడ్డను చూడటం..
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీ కలలో బల్లి బిడ్డ కనిపిస్తే కూడా అది మంచిది కాదు. ఇది అశుభ సంకేతమని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఇలాంటి కల మీకు పడితే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి.
lizards
రెండు బల్లుల కొట్లాట
మీరు ఎప్పుడైనా.. మీ కలలో రెండు బల్లులు కొట్లాడుకున్నట్టు చూసారా? అయితే మీరు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ కల.. మీరు మీ జీవితంలో ఎన్నో సమస్యలను, అడ్డంకులను ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది. పీడకలల ప్రభావం తగ్గాలంటే వాటిని మీకు తెలిసిన వారిలో చర్చించండి. అలాగే దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దానధర్మాలు చేయండి.