Hindu Beliefs: భోజనం మధ్యలో లేస్తే ఏమౌతుంది..?
హిందూ సంప్రదాయం ప్రకారం.. భోజనం మధ్యలో ప్లేటు ముందు నుంచి లేస్తే ఏమౌతుంది? ఏ సందర్భాల్లో భోజనం మధ్యలో వదిలేసినా తప్పు కాదు? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

EatingEating
కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దలు చెబుతూ ఉంటారు. జీవితంలో ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటికోసమే. అయితే.. ఆ తిండినే చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్లేటులో భోజనం పెట్టుకొని.. దానిని తినకుండా మధ్యలో ఏదో పని ఉందని లేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. భోజనం మధ్యలో ప్లేటు ముందు నుంచి లేస్తే ఏమౌతుంది? ఏ సందర్భాల్లో భోజనం మధ్యలో వదిలేసినా తప్పు కాదు? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

హిందూ మత గ్రంథాలలో ఎప్పుడూ ఆహారాన్ని మధ్యలో ఉంచకూడదని, లేకుంటే అది తల్లి అన్నపూర్ణను , ఆహార దేవుడిని అవమానించినట్లు అవుతుంది అని పెద్దలు చెబుతుంటారు. కానీ మరోవైపు, ఏ పరిస్థితిలో ఆహారం తినే మధ్యలో లేవడం మంచిదో, , లేకుంటే చెడు ప్రభావాలు , పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని మత గ్రంథాలలో కూడా ప్రస్తావించారు.
Eating Food
ఎప్పుడు ఆహారాన్ని తినకుండా వదిలివేయాలి?
మీరు తినడానికి కూర్చున్నట్లయితే, ఆహారం తినే వ్యక్తి, ఆహారం వండే వ్యక్తి , ఆహారం వడ్డించే వ్యక్తి ఎల్లప్పుడూ తమ జుట్టును కట్టుకుని ఉండాలని హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది ఎందుకంటే ఆ వ్యక్తి శక్తి జుట్టులో నివసిస్తుందని నమ్ముతారు. జుట్టు అల్లుకుని ఉన్నప్పుడు శక్తి చాలా అనకూలంగా ఉంటుంది. కానీ, మీరు జుట్టు విప్పి ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆహారం తినేటప్పుడు జుట్టు రాలి తినే ఆహారంలో పడితే.. ఆ ఆహారాన్ని వదిలేయాలట.
eating food
అంతేకాదు.. భోజనం చేసే సమయంలో అందులో ఏదైనా తినకూడనివి వచ్చినా, ఏదైనా రాయి లాంటివి తగిలినా.. అలాంటి భోజనం కూడా చేయకూడదు. దీని వల్ల రాహువు ప్రభావం పడుతుందట. నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట. ఇలాంటి ఆహారం కూడా తినకూడదు. మధ్యలో వదిలేయవచ్చట. ఇలాంటి ఆహారం నల్ల కుక్కకు తినిపించాలట.
- when we should leave food in between
- when we should leave food in between as per astro
- when we should leave food in between as per astrology
- when we should leave food in between while eating as per astro
- when we should leave food in between while eating as per astrology
- when we should not eat food
- when we should not eat food as per astro
- when we should not eat food as per astrology

