ఈ రాశివారికి రైడింగ్ అంటే చాలా ఇష్టం..!
మీ రాశి చక్రం ద్వారా చెప్పేయవచ్చట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి అలవాటు, అభిరుచులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

ఒక్కో వ్యక్తి ఒక్కో అలవాటు, అభిరుచులు ఉంటాయి. అది మనిషి మనిషికీ.. వారి వ్యక్తిత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే... ఆ అలవాట్లను, అభిరుచులను.. మీ రాశి చక్రం ద్వారా చెప్పేయవచ్చట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి అలవాటు, అభిరుచులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి..
ఈ రాశివారికి క్రీడలు, కంప్యూటర్ గేమ్స్, మోటార్ బైక్ రీడింగ్, లైవ్ మ్యూజిక్ లాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు.
వృషభ రాశి..
ఈ రాశివారికి గార్డెనింగ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా చేపలు పట్టడం.. పెయింటింగ్ వేయడం.. స్లో మ్యూజిక్ వినడం లాంటివి ఎక్కువ ఇష్టపడతారు. ఏదైనా ప్రకృతికి సంబంధించిన వాటిని వీరు ఎక్కువగా ఇష్టపడతారు.
మిథునరాశి..
వీరికి కొత్త రకం క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలు చదవడం.. మెంటారింగ్ చేయడం వీరికి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏదైనా భిన్నమైన వాటిని చేయడానికి వీరు ఆసక్తి చూపిస్తారు.
కర్కాటక రాశి..
వీరికి వంట చేయడం.. వ్యవసాయం చేయడం.. ఎక్కువ ప్రయాణాలు చేయడం లాంటివి ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఏది చేసినా కుటుంబంతో కలిసి చేయడం వీరికి ఎక్కువ ఇష్టం.
సింహ రాశి..
ఈ రాశివారికి పెయింటింగ్ చేయడం.. మ్యూజిక్ , పార్టీలు ఆర్గనైజ్ చేయడం.. సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం ఎక్కువగా ఇష్టం.
కన్య రాశి..
వీరికి మొక్కలు పెంచడం.. హ్యాండీ వర్క్స్ చేయడం .. ఏదైనా భూమికి సంబంధించిన పనులు చేయడం ఎక్కువగా ఇష్టం.
తుల రాశి..
వీరికి డ్రామాలు చూడటం.. థ్రిల్లర్ షోలు చూడటం.. రెస్టారెంట్ లలో ఫుడ్ తినడం ఎక్కవుగా ఇష్టం.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి.
ఈ రాశివారికి మెడిటేషన్, ఇష్టమైన వారితో కలిసి గేమ్స్ ఆడటం లాంటివి ఎక్కువ ఇష్టం.
ధనస్సు రాశి..
ఈ రాశివారికి ట్రావెలింగ్ అంటే పిచ్చి. అడ్వెంచర్ క్రీడలు ఆడటం.. ఎక్కువగా అవుట్ డోర్ క్యాంపింగ్ లాంటివి ఎక్కువ ఇష్టం.
మకర రాశి..
ఈ రాశివారికి గార్డెనింగ్, రీడిం్, పెయింటింగ్ , బుర్రకు పదును పెట్టే యాక్టివిటీలు ఎక్కువగా నచ్చుతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి..
ఈ రాశివారికి వీడియో గేమ్స్ ఆడటం, పజిల్స్ పూర్తి చేయడం , రీడింగ్ లాంటివి ఇష్టం. ఏదైనా బుర్రకు పదును పెట్టడం ఇష్టం.
మీన రాశి :
మీన రాశి..
ఈ రాశివారికి పుస్తకాలు చదవడం, యోగా చేయడం లాంటివి ఎక్కువ ఇష్టపడతారు. ఏదైనా బుర్రకు పదును పెట్టడం ఇష్టం.