ఈ రాశివారికి అసలైన ఎనర్జీ ఎంటో తెలుసా..?
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి స్పెషాలిటీతోపాటు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. మరి ఆ ఎనర్జీ ఏంటి.? అది ఏ సమయంలో బయటపడుతుందో ఇప్పుడు జోతిష్య శాస్త్రం ప్రకారం చూద్దాం..
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ఉంటుంది. ఆ మంచికి తగినట్లే చెడు ఉంటుంది. అదేవిధంగా.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి స్పెషాలిటీతోపాటు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. మరి ఆ ఎనర్జీ ఏంటి.? అది ఏ సమయంలో బయటపడుతుందో ఇప్పుడు జోతిష్య శాస్త్రం ప్రకారం చూద్దాం..
1.మేష రాశి..
ఈ రాశివారు మామూలు సమయంలో చాలా నార్మల్ గానే ఉంటారు. కానీ...ఎవరైనా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు మాత్రం తమలోని ఎనర్జీ మొత్తం బయటకు తీస్తారు. అంటే.. వారి ముందు గంభీరంగా , క్రూరంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. అసహనంగా ఉంటారు.
2.వృఫభ రాశి..
ఈ రాశివారికి ఓపిక చాలా ఎక్కువ. అదే వారి అసలైన ఎనర్జీ అని చెప్పొచ్చు. వీరు చాలా డౌన్ టూ ఎర్త్ పర్సనాలిటీ. చాలా ప్రొటెక్టివ్ రాశివీరు. అదే వీరికి అసలు సిసలైన ఎనర్జీని అందిస్తుంది.
3.మిథున రాశి..
ఈ రాశివారి ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు. కానీ.. ఇతరులతో బాగా కలుస్తారు. అదే వీరిలోని ఎనర్జీ పాయింట్ అని చెప్పొచ్చు. వీరితో కలిసిన వారికి ఎవరికైనా ఫ్రెండిష్ వైబ్ వచ్చేస్తుంది.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితం. చాలా కేరింగ్. తమ వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమలోని హోమ్లీ ఎనర్జీని ఇతరులకు పంచడానికి కూడా వీరు ముందుంటారు.
5.సింహ రాశి..
ఈ సింహ రాశివారు చాలా రాయల్ అని చెప్పొచ్చు. నిత్యం షైన్ అవుతూ ఉంటారు. వీరు ఎదుటి వారి నుంచి నిత్యం అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు తమను చూసి తాము చాలా గర్వపడుతుంటారు. అదే వారిలోని ఎనర్జీ అని చెప్పొచ్చు. చాలా హుందాగా ప్రవర్తిస్తారు. చాలా ఫర్ఫెక్ట్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
7.తుల రాశి..
తుల రాశివారు అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరితోనైనా హ్యాపీ వైబ్స్ ని పంచుతారు. అదే వీరిలోని ఎనర్జీగా చెప్పొచ్చు.
8.వృశ్చిక రాశి.
వృశ్చిక రాశివారు చాలా మిస్టీరియస్ గా ఉంటారు. ఎవరికీ అర్థం కారు. అదే తమలోని స్పెషాలిటీగా భావిస్తారు. కానీ.. అప్పుడు చాలా చమత్కారంగా కూడా ఉంటారు. కానీ.. వీరి వద్ద రహస్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు తమ మూడ్ ని పట్టి ప్రవర్తిస్తూ ఉంటారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా తెలివిగల వారు. వీరిలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరినైనా డామినేట్ చేయాలి అనుకుంటే.. వారిని భయపెట్టాలని చూస్తారు. అలా కుదరదు అనుకున్నప్పుడు.. ఎదుటివారితో ఫ్రెండ్లీ ఎనర్జీ ఇచ్చి.. తమ డామినేషన్ పూర్తి చేస్తారు.
10.మకర రాశి..
ఎనర్జీ అనే పదం వీళ్ల నుంచే పుట్టిందా అన్నట్లుగా ఉంటారు. వీరు చాలా కష్టపడతారు. ప్రతి విషయంలోనూ చాలా ఎనర్జీగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీరిలో అలసట అనేది రాదు.
11.కుంభ రాశి..
ఈ రాశివారిలో ఊహాత్మకంగా ఉంటారు. చాలా క్రియేటవ్ థాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదీ పట్టించుకోనట్లుగా కనిపిస్తారు కానీ.. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు.
12.మీన రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ.. ఏదో ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. భూమి మీద కాకుండా.. మరెక్కడో విహరిస్తూ ఉంటారు. వీరు చాలా సెన్సుబుల్ గా ఉంటారు. ఎదుటివారితోనూ అలానే ప్రవర్తిస్తారు.