Dreams:రాత్రి పూట పీడకలలు వస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు
రెగ్యులర్ గా రాత్రి పీడకలలు వస్తున్నాయంటే అర్థమేంటి? జోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Remedies for Bad Dreams in Astrology
నిద్రలో కలలు రావడం చాలా సహజం. ఒక్కోసారి మంచి కలలు వస్తాయి.. మరోసారి చెడు కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే... ఎక్కువగా పీడకలలు వస్తుంటే ఎవరికైనా భయం వేయడం సహజం. ఏదో ఒక్కరోజు వస్తే పర్వాలేదు.. రోజూ వస్తే మాత్రం ఆలోచించాల్సిందే. మరి.. రెగ్యులర్ గా రాత్రి పీడకలలు వస్తున్నాయంటే అర్థమేంటి? జోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
మనం పుట్టిన సమయంలో గ్రహాల స్థానాలు మన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను, మన కలలను కూడా ప్రభావితం చేస్తాయని జోతిష్యశాస్త్రం చెబుతోంది. కొన్ని గ్రహాలు నిర్ధిష్ట మార్గంలో లేనప్పుడు పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందట. ఉదాహరణకు మీ జాతకంలో కుజుడు ప్రముఖంగా ఉంటే.. మీకు ఎక్కువ పీడ కలలు వచ్చే ఛాన్స్ ఉందట.
పీడ కలలు ఎందుకు వస్తాయి..?
మన మసులోని ఆలోచనలే కలలుగా వస్తాయట. మీకు తెలియకుండానే మీ లో ఉన్న భయాలు, ఆందోళనలు కలలో రూపంలో రాత్రిపూట వస్తూ ఉంటాయి. లేదంటే.. మీరు చూసిన సినిమా ఏదైనా కూడా కలల రూపంలో రావచ్చు.
చెడు కలలు వస్తే ఏమౌతుంది?
తరచుగా వచ్చే పీడకలలు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. దాని వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చెడు కల నుండి మీరు భయపడి లేదా ఆందోళన చెందుతున్నట్లు మేల్కొంటే, అది పగటిపూట మీ మానసిక స్థితి, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
dreaming
చెడు కలలను ఎదుర్కోవడానికి చిట్కాలు:
మీరు తరచుగా చెడు కలలను చూస్తుంటే, వాటిని తగ్గించడానికి మీరు తీసుకోగల కొన్ని దశలు ఉన్నాయి. నిద్రవేళకు ముందు బ్రీతింగ్ వ్యాయామాలతో పాటు,ధ్యానం లాంటివి చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెడు కలలు వచ్చే అవకాశం తగ్గుతుంది. లేదు ఏం చేసినా కలలు రావడం తగ్గడం లేదంటే... డాక్టర్ ని సంప్రదించడం మంచిది.