గోర్లను రుద్దితే నిజంగా సంపద పెరుగుతుందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మన వేళ్లలో గ్రహాలు నివసిస్తాయి. అందుకే మనం చేసే పని ప్రకారం.. గ్రహాలు మనకు శుభం లేదా అశుభాన్ని కలిగిస్తాయి. మరి జ్యోతిష్యం ప్రకారం.. గోర్లను రబ్ చేస్తే సంపద పెరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మనకున్న అలవాట్ల గురించి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో వివరించబడి ఉంది. అయితే ఈ అలవాట్లు ఏదో ఒక గ్రహంతో ఏదో ఒక విధంగా సంబంధాన్ని కలిగుంటాయట. దీనివల్ల మనకు శుభ లేదా అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అయితే కొన్ని అలవాట్లు రాహువును బలహీనపరుస్తాయి. అలాగే మనకు చెడు జరిగేలా చేస్తాయి. మనకున్న అలవాట్లలో గోర్లను రుద్దడం కూడా ఉంది. చాలా మంది ఆడవాళ్లు తరచుగా గోర్లను రుద్దుతుంటారు. అయితే గోర్లను రుద్దితే సంపద పెరుగుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీనిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గోళ్లను రుద్దితే సంపద పెరుగుతుందా?
జ్యోతిష్యం ప్రకారం.. ప్రతి ఒక్కరి వేళ్లలో గ్రహాలు నివసిస్తాయి. అంటే మనం మన వేళ్లను దేనికి ఉపయోగిస్తామో దాన్ని బట్టి మనకు శుభ లేదా అశుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాలే మనకు మంచి జరగాలా? చెడు జరగాలా? అన్న దాన్ని నిర్ణయిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వేళ్లను ఉపయోగించడం అంటే.. మనం వీటిని ఎన్నో పనులకోసం ఉపయోగిస్తాం. అంటే తినడానికి, తాగడానికి, శుభ్రం చేసుకోవడానికి వంటివి కాదు. అంటే వీటివల్ల మీకు ఎలాంటి చెడు జరగదు. కానీ గోర్లను పదే పదే రుద్దడం మంచిది కాదంటున్నారు జ్యోతిష్యులు. కానీ ఇలా గోర్లను రుద్దడం ఒక అలవాటుగా మారుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. దీనివల్ల గ్రహాలు మేల్కొని తమ ప్రభావాన్ని నేరుగా చూపించడం ప్రారంభిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మన చూపుడు వేలిలో బృహస్పతి, మధ్య వేలిలో శని, ఉంగర వేలిలో సూర్యుడు, చిన్న వేలిలో బుధుడు, బొటనవేలులో శుక్రుడు నివసిస్తారు. ఈ వేళ్లను రుద్దితే ఈ గ్రహాల పవిత్రత బహిర్గతమవుతుంది.
రెండు చేతుల వేళి గోర్లను కలిపి రబ్ చేస్తు గ్రహాలన్నీ దృఢంగా మారుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ప్రతి గ్రహం ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అలాగే ఇవి మీపై విభిన్నంగా ప్రభావాన్ని చూపించడం మొదలుపెడతాయి.
వేళ్లను రబ్ చేయడం వల్ల నిజంగా సంపద పెరుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. అలాగే మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండి ఉంటుందట. అలాగే మీరు మీ జీవితంలో ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు. కానీ దీనివల్ల ఈ శుభాలు జరగాలంటే మాత్రం బ్రహ్మముహూర్తంలోనే వేళ్లను రుద్దాలి. అప్పుడే ఈ ఫలాలు మీకు దక్కుతాయి.