ఎత్తు నుంచి కింద పడ్డట్టు కలగన్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
కలలను కనడం సాధారణ విసయం. మనమందరం నిద్రలో అపుడప్పుడు కలలుగంటుంటాం. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఈ కలలకు కూడా వాటి స్వంత అర్థం ఉంటుంది. అయితే ఎత్తు నుంచి పడ్డట్టు చాలా మంది కలలుగంటుంటారు. దీని అర్థం ఏంటో తెలుసా?

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో కనిపించే వస్తువులు లేదా సంఘటనలు మన భవిష్యత్తు గురించి కొన్ని ఆధారాలను ఇస్తాయి. ఇవి మనకు మంచి చేయొచ్చు. లేదా అశుభమైనవి కావొచ్చు. చాలా మందికి ఎత్తు నుంచి కింద పడిపోవడం, పైకప్పుపై నుంచి పడిపోవడం లేదా జారడం వంటి కలలు వస్తుంటాయి. ఈ కలలు శుభమా, అశుభమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అలాంటి కల మంచిది కాదు
డ్రీమ్ సైన్స్ ప్రకారం ఎత్తు నుంచి పడిపోయే కల శుభప్రదంగా పరిగణించబడదు. ఒక వ్యక్తి కలలో ఎత్తు నుంచి పడిపోవడాన్ని చూస్తే ఆ వ్యక్తి ఏదో ఒక ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థ. అలాగే మీరు భవిష్యత్తులో పెద్ద సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
కలలో పైకప్పుపై నుంచి పడటం అంటే?
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కలలో పైకప్పు నుంచి పడిపోవడాన్ని చూస్తే.. రాబోయే కాలంలో ఆ వ్యక్తి శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. ఉదాహరణకు.. కీళ్ల నొప్పులు లేదా చీలమండలో నొప్పి సమస్య రావొచ్చు. అందుకే ఇలాంటి కలలు శుభప్రదంగా పరిగణించలేం.
ఈ కల వస్తే జాగ్రత్తగా ఉండండి
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కలలో తాను జారిపడటం కూడా శుభప్రదంగా పరిగణించరు. ఈ కల అర్థం మీరు భవిష్యత్తులో మీ పరిచయస్తుడు లేదా బంధువు చేత మోసపోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.