మీ పిల్లలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసా..?
మరి నిజానికి అసలు మీ పిల్లలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయం చాలా మంది తెలుసుకోరు. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం...మీ పిల్లలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చు.

parenting
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిరంతం కష్టపడుతూ ఉంటారు. దాదాపు అందరూ... తమ పిల్లలకు ఏమి చేయాలి..? అది ఇవ్వాలి... ఇది ఇవ్వాలి అంటూ ఆలోచిస్తూ ఉంటారు. మరి నిజానికి అసలు మీ పిల్లలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయం చాలా మంది తెలుసుకోరు. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం...మీ పిల్లలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చు.
1.మేష రాశి..
మేష రాశి పిల్లలు చాలా ఆంబీషియస్ గా ఉంటారు. ఈ రాశి పిల్లలు ఎక్కువగా తమ పేరెంట్స్ నుంచి ఎక్కువగా మద్దతు కోరుకుంటారు. అంతేకాకుండా.. తమ పేరెంట్స్ తమను ఇలా ఉండూ... అలా ఉండూ అని కంట్రోల్ చేయాలని చూస్తే వీరికి అస్సలు నచ్చదు. కొద్దిగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు.
2.వృషభ రాశి..
వృషభ రాశి పిల్లలు రాయిలాగా ఉంటారు. దేనికి పెద్దగా స్పందించరు. వారి గుండె ని రాయిలా చేసుకున్నారా అన్నట్లుగా ఉంటారు. ఈ రాశి పిల్లలు.. తమ పేరెంట్స్ దగ్గర నుంచి కొంత ఓపికను కోరుకుంటారు. తాము తీసుకునే నిర్ణయాలపై వారు నమ్మకం ఉంచాలని అనుకుంటూ ఉంటారు.
3.మిథున రాశి..
ఈ రాశి పిల్లలు.. తాము అందరితో ఇంటారాక్ట్ అవ్వాలని కోరుకుంటారు. తమ మనసులోని భావాలను వ్యక్తపరచాలని అనుకుంటారు. అందుకు.. తమ తల్లిదండ్రుల నుంచి మద్దతు వస్తే బాగుండని అనుకుంటూ ఉంటారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన పిల్లలు.. తమ తల్లిదండ్రుల నుంచి ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటారు. ఈ రాశి పిల్లలలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఎక్కువగా అభద్రతాభావం కలిగి ఉంటారు. కాబట్టి.. తమ పేరెంట్స్ తమపై కేర్, లవ్ అటెన్షన్ చూపిస్తే బాగుండని భావిస్తారు.
5.సింహ రాశి..
సింహ రాశికి చెందిన పిల్లలకు అసలు భయం అంటే ఏంటో తెలీదు. దేనికీ భయపడరు. కానీ.. ఈ రాశి పిల్లలు.. తమ పేరెంట్స్ దగ్గర నుంచి అటెన్షన్ ఎక్కువగా కోరుకుంటారు. వారు కోరుకున్నది.. తమ పేరెంట్స్ చేసినప్పుడు.. వారి కోరికలు తీర్చినప్పుడు వీరు చాలా ఆనందపడతారు.
6.కన్య రాశి..
కన్య రాశికి చెందిన పిల్లలు.. చాలా కష్టపడతారు. అన్ని విషయాలో పర్ఫెక్ట్ గా ఉంటారు. కాబట్టి.. తమ పేరెంట్స్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాల్లో.. తమకు కూడా అవకాశం ఇస్తే బాగుండని కోరుకుంటారు.
7.తుల రాశి..
ఈ రాశికి చెందిన పిల్లలకు ఏ విషయంలో ఎంత బ్యాలెన్స్ డ్ గా ఉండాలో బాగా తెలుసు. ముఖ్యంగా ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు. అయితే.. తాము చెప్పే విషయాలను తమ పేరెంట్స్ వింటే బాగుండని ఈ రాశి పిల్లలు కోరుకుంటారు.
8. వృశ్చిక రాశి..
వృశ్చిక రాశికి చెందిన పిల్లలకు ఎంకరేజ్మెంట్, మోటివేషన్ చాలా అవసరం. ప్రతి విషయంలోనూ వారిని ఎవరో ఒకరు వెనక నుంచి ముందుకు పుష్ చేస్తూ ఉండాలి. అలా తమ వెనక తమ పేరెంట్స్ ఉంటే బాగుండని వీరు కోరుకుంటారు. అలా వారు ఉంటే వీరు జీవితంలో ఏదైనా సాధించగలరు. లేకపోతే... సందేహాలతో బతికేస్తారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశికి చెందిన పిల్లలు సాహసోపేతంగా ఉంటారు. కొంచెం క్యూరియాసిటీ కూడా ఎక్కువ అనే చెప్పాలి. కానీ.. వీరు బాధ్యతలకు కట్టుపడి ఉండటాన్ని ఇష్టపడరు. తాము స్వేచ్ఛగా ఉండి.. ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటారు. అది తమ పేరెంట్స్ అర్థం చేసుకుంటే బాగుండని వీరు అనుకుంటూ ఉంటారు.
10.మకరరాశి..
మకర రాశి పిల్లలు కూడా ధనస్సు రాశి వారిలాగానే ఉంటారు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ప్రతిదీ రీజనబుల్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంటారు. వారు చేసే పనికి కొద్దిగా సపోర్టు చేస్తే చాలు..జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు.
11.కుంభ రాశి..
ఈ కుంభ రాశికి చెందిన పిల్లలు.. తమను తాము అందరికన్నా డిఫరెంట్ గా.. ప్రత్యేకంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. వీరి ఆలోచనలు చాలా క్రియేటివ్ గా.. విభిన్నంగా ఉంటాయి. తమను తమ పేరెంట్స్ నమ్మితే చాలు అని ఈ పిల్లలు కోరుకుంటారు.
12.మీన రాశి..
మీన రాశికి చెందిన పిల్లలు.. చాలా ప్రేమగా , దయగా, అర్థం చేసుకునే విధంగా ఉంటారు. తాము చూపిస్తున్న ప్రేమ, కేరింగ్... తమ పేరెంట్స్ కూడా తమపై చూపించాలని వీరు అనుకుంటూ ఉంటారు.