MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope : ఈ వారం ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, చేతి నిండా డబ్బే డబ్బు..!

Weekly Horoscope : ఈ వారం ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, చేతి నిండా డబ్బే డబ్బు..!

ఈ వారం వారఫలితాలు తేదీ 29 ఏప్రిల్ శుక్రవారం నుండి మే 5 గురువారం 2022 వరకు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతం నుంచి మీకు దూరంగా ఉన్న బంధువులు దగ్గరవుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది.

6 Min read
Author : Bukka Sumabala
| Updated : Apr 29 2022, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Aries

Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆత్మబలం, పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుని తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా దృఢవిశ్వాసంతో అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల వారికి అన్ని విధాలా అనుకూల పరిస్థితి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

213
Taurus

Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం మీరు చేపట్టిన పనులు మీ ప్రమేయం లేకుండానే పూర్తి కాగలవు. ఆర్థికంగా మునుపటి కంటే బలం పుంజుకుని రుణవిముక్తి పొందుతారు. గతం నుంచి మీకు దూరంగా ఉన్న బంధువులు దగ్గరవుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313
Gemini

Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం మొదట్లో కొంత నిరుత్సాహంతో ప్రారంభమైనా క్రమేపీ ఉత్సాహం కలుగుతుంది. ముఖ్య వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎంతోకాలంగా ఉన్న భూవివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుని మీదారికి తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413
Representative Image: Cancer zodiac

Representative Image: Cancer zodiac

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం మీ సమస్యలు కొన్ని అవలీలగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. ధైర్యం, ఓర్పుతో ముందడుగు వేసి విజయాలతీరం చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513
Leo

Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం మీ సమస్యలు కొన్ని అవలీలగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. ధైర్యం, ఓర్పుతో ముందడుగు వేసి విజయాలతీరం చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

613
(Virgo)

(Virgo)

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం పరిస్థితులను బేరీజు వేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ఏ వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

713

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా కొనసాగుతుంది. సన్నిహితుల సహాయం అందుకుని కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

813
Scorpio

Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం  సమస్యలకు ఎదురీది అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. మిత్రులతో మాటపట్టింపులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉండవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక నిరాశ చెందుతారు. బంధువులతో కొన్ని వివాదాలు నెలకొని మీకు పరీక్షగా నిలుస్తాయి. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేక సతమతమవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. ఉద్యోగాలలో మరింత సమర్థనీయంగా పనిచేయాల్సి ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం మీ సమర్థతకు బంధువులు కూడా ఆశ్చర్యపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాల మధ్యలో కొంత నిరాశ పర్చినా లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113
(Aquarius)

(Aquarius)

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం కొత్త వ్యవహారాలు ప్రారంభం నుంచీ విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై ఆర్థికంగా బలపడతారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఊరట చెందుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213
Pisces Zodiac

Pisces Zodiac

మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఇతరులకు సైతం సాయం అందించడం ద్వారా ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తృతం చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. అనారోగ్యం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.    

1313

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi 2026:శ్రీ పరాభవనామ ఉగాది..వృశ్చిక రాశి కి ఈ ఏడాది కలిసొచ్చేనా?
Recommended image2
Venus Moon Transit: రాశి మారనున్న శుక్రుడు, చంద్రుడు.. ఈ 3 రాశులవారికి మంచిరోజులు మొదలైనట్టే
Recommended image3
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved