MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope : ఈ వారం ఈ రాశివారికి ప్రత్యర్థులనుంచి సానుకూలత లభిస్తుంది..!

Weekly Horoscope : ఈ వారం ఈ రాశివారికి ప్రత్యర్థులనుంచి సానుకూలత లభిస్తుంది..!

ఈ వారం రాశిఫలాలు.. వారఫలితాలు తేదీ 22 ఏప్రిల్ శుక్రవారం 2022 నుండి 28  గురువారం 2022 వరకు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  అనుకున్న విధంగా ఆర్థిక లావాదేవీలు కొనసాగుతాయి. ఊహించని ఒక వ్యక్తి ద్వారా కొంత సహాయం అందవచ్చు.

6 Min read
Author : Bukka Sumabala
Published : Apr 22 2022, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం మీ లక్ష్యాల సాధనలో కొంత శ్రమిస్తే ఫలితం ఉంటుంది. అనుకున్న విధంగా ఆర్థిక లావాదేవీలు కొనసాగి అవసరాలు తీరతాయి. గతం నుంచి ఎదుర్కొంటున్న ఒక సమస్య ఎట్టకేలకు పరిష్కారమవుతుంది. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల విస్తరణపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ విధుల్లో ప్రతిబంధకాలు క్రమేపీ అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

213

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి, హోదాలు కలిగిన వ్యక్తులు మీకు సహాయపడతారు. ఊహించని ఒక వ్యక్తి ద్వారా కొంత సహాయం అందవచ్చు. ఆర్థికంగా ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో మీ చొరవ కీలకం కానుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మునుపటి కంటే కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొందరి జోక్యం మీకు ఇబ్బందిగా మారవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313
(Gemini)

(Gemini)

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం మీరు ఊహించని విధంగా కొంత ధనప్రాప్తి కలిగే సూచనలు. శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సందేశం. జీవిత భాగస్వామి ద్వారా కొంత ఆస్తిలాభం కలుగవచ్చు. నూతన విద్య, ఉద్యోగాలు దక్కే అవకాశం. బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబసభ్యులు మీ ప్రతిభను గుర్తిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక అశాంతి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వచ్చే అవకాశం. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ మెరుగుపడి అవసరాలు తీరతాయి. చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా మీదారిలో నడవండి, లక్ష్యాలు సాధిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం మంచిది. విదేశీ విద్యావకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. రాజకీయవేత్తలు తమ పదవులను పదిలం చేసుకుంటారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం జీవితంలో మరపురాని ఒక సంఘటన ఎదురుకావచ్చు. మీ ఆలోచనలకు మరింత పదునుపెట్టాల్సిన సమయం. బంధువుల ద్వారా కొంత సహాయసహకారాలు అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహణపై బంధుగణంతో చర్చలు జరుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో వేగం పెరుగుతుంది. లాభాలదిశగా సాగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు చిక్కులు వీడి ఉత్సాహం నెలకొంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యవహార జ్ఞానం ఉన్నా కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లే సూచనలు. ప్రతి విషయంలోనూ ఆలోచన ముఖ్యం. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాల విస్తరణ యత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం, ఒత్తిడులు తప్పవు. రాజకీయవేత్తలు ఆచితూచి ముందుకు సాగడం ఉత్తమం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

713

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం మీ ఊహలు, ఆలోచనలకు తగినట్లుగానే వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు. అన్నింటా మీకు ఊహించని మద్దతు పెరుగుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించే కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు, విధులు చేపట్టే వీలుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం మీ సమర్థత, నేర్పుతో కొన్ని సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ఇతరుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. మీ ఆలోచనలు అందరికీ ఆమోదకరంగా ఉంటాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు లభించే సమయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు సైతం చేపట్టే వీలుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుండి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలించి రుణభారాలు తగ్గుతాయి. అత్యంత కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యావకాశాలు దక్కుతాయి. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు నచ్చుతాయి. గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. చర్చలు సఫలం కాగలవు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. మీఖ్యాతి పెరిగి అందరూ ప్రశంసిస్తారు. వాహనాలు కొంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. వ్యాపారాలు లాభసాటిగా సాగి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగాల వారికి అన్ని విధాలుగా అనుకూల సమయం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం చేపట్టిన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఊహించని విజయాలు సిద్ధిస్తాయి. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు తీరి ఉపశమనం పొందుతారు. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మిత్రులు  మాటసహాయం అందిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయవర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి ఉపకరించే సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహణకు సన్నద్ధమవుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, భూముల కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం
Recommended image2
Moon Transit: కుంభ రాశిలో మహా లక్ష్మీ రాజయోగం... ఈ మూడు రాశుల జీవితంలో కనక వర్షం..!
Recommended image3
Saturn Effect on Relationship: దాంపత్య జీవితంపై శని ప్రభావం ఉంటుందా? కలిసిపోతారా? విడిపోతారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved