MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఈ రాశివారు వారాంతంలో శుభవార్తలు వింటారు.

వార ఫలాలు: ఈ రాశివారు వారాంతంలో శుభవార్తలు వింటారు.

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  వ్యాపారులకు పెట్టుబడులకు తగిన ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. 

5 Min read
Author : ramya Sridhar
Published : Oct 09 2022, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళన. అనవసరమైన ఖర్చులు. తలపెట్టిన పనులను నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. సంఘమునందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రులతో మనస్పర్ధలు. నూతన వస్తు వాహన ప్రాప్తి. గృహమునందు కొన్ని సమస్యలు బాధించును. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మీ జీవితంలో ఓ ప్రత్యేకతను తీసుకువస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు నూతన విద్యల యందు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. వారాంతంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్త పడవలెను. కొంతకాలం నుండి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు   దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

514


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారం లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేయు వృత్తి వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. గృహ నిర్మాణములు ముందుకు సాగుతాయి. పొదుపు మార్గములు అన్వేషణ చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి వలన చికాకులు కలుగును. మనసు నందు ఆందోళన. శారీరక శ్రమ. కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగు వేయవలెను. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం కొన్ని జాగ్రత్తలు, భగవంతుడి పై దృష్టి పెట్టడం ద్వారా ఆపదలు నుంచి బయిటపడతారు.  ప్రారంభించి నిలిచిపోయిన పనులు ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఉద్యోగమునందు ఒత్తిడి అధికంగా ఉండును. మీ పక్కన ఉండే వారు మీకు అపకార ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. బంధు మిత్రులతో అనుకోని గొడవలు ఏర్పడగలవు. సంతాన విషయంలో తగు శ్రద్ధ వహించవలెను. వారాంతంలో శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారము నందు ధనలాభం. కొత్త ఆలోచనలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
 

714


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల కలయిక. వారాంతంలో  నిలిచిపోయిన పనులు పూర్తవును. విద్యార్థులు విద్య యందు శ్రద్ద వహించవలెను. వృత్తి వ్యాపారముల యందు ఆశించిన లాభం. సంఘమునందు కలహాలు. ఉద్యోగమునందు సహనముగా ఉండవలెను. కోర్టు వ్యవహారంలో అనుకూలమైన తీర్పులు. గృహ నిర్మాణ కార్యక్రమాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగవలెను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో  స్వల్ప లాభాలు. అనుకోని కలహాలు. సంఘమునందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉపకారం చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. . దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
గృహం నందు శుభకార్యములు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. సంఘం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. పట్టుదలతో ప్రయత్నించిన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు సహాయపడతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శుభకార్యములలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగవలెను. మనస్సు నందు ఆందోళన. వృత్తి వ్యాపారంలో సామాన్యం. దీర్ఘకాలిక రోగములు ఇబ్బంది పెట్టును. సంతాన మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పశ్చిమదిశ ప్రయణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

ఈ వారం చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనుల్లో కదిలిక వస్తుంది. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం. గృహమునందు శుభకార్యా చరణ. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు. చేయు పనుల యందు ఆసక్తి లేక పోవుట. మనసు నందు ఆందోళనగా ఉండును. వ్యాపారులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం చేయాలి. ఉద్యోగస్తులకు పై అధికారులు ఒత్తిడులు. ఆరోగ్యం కుదుటపడి మనశ్శాంతి లభిస్తుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

1214


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది.  ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. నూతన వస్తూ వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవలెను. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. భూ గృహ క్రయవిక్రయాలు అనుకూలం. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వారాంతంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది మనశ్శాంతి లోపిస్తుంది.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం అతి సామాన్యంగా ఉంటుంది. కాస్తంత అప్రమత్తత అవసరం. ఏ పని చేసినా కలిసి రాకపోవుట. మానసికంగా బాధ. పెట్టుబడులు లాభించక ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొంతమేర రుణం చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించవలెను. సన్నిహితులతో కలహాలు. సంతాన విషయంలో తగు జాగ్రత్త తీసుకునవలెను. ప్రభుత్వ సంబంధించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వారాంతంలో ధన లాభం. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

1414


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది.   ఈవారం ఉత్సాహంగా గడుపుతారు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం నందు ఇబ్బందులు ఏర్పడిన అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో కలసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల కలయిక. వారాంతంలో మానసిక ఒత్తిడి. పనులలో ఆటంకాలు మరియు ఆరోగ్య పరంగా  ఇబ్బందులు ఏర్పడతాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved