Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు శత్రువులను కూడా తమ దారిలోకి తెచ్చుకుంటారు!
Weekly Horoscope: ఈ వార ఫలాలు 4.1.2026 నుంచి 10.1.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలం. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు.
వృషభ రాశి ఫలాలు
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చుతారు. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాల నుంచి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహన, భూమి కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. శత్రువులను కూడా మీ దారికి తెచ్చుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ ఆమోదిస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
కన్య రాశి ఫలాలు
వారం ప్రారంభంలో కాస్త చికాకు వాతావరణం ఉంటుంది. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. మీ అంచనాలు, ఊహలు కొన్ని నిజమవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల రాశి ఫలాలు
అనుకున్న పనులు పూర్తి చేయాలన్న తపన పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణ యత్నాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు జరుగుతాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. భూమి, వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి.. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వస్తాయి.
మకర రాశి ఫలాలు
సన్నిహితులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆస్తుల క్రయ విక్రయాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వస్తు లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు తొలగుతాయి.
మీన రాశి ఫలాలు
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట చెందుతారు. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.

