MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Weekly Horoscopes:ఓ రాశివారికి ఈ వారం ఆనందమే ఆనందం..!

Weekly Horoscopes:ఓ రాశివారికి ఈ వారం ఆనందమే ఆనందం..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశి  వారికి అవసరములకు మించిన ఖర్చులు. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంతాన అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jul 31 2022, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ వారం మీకు బాగుంది. వారాంతంలో ఆర్థిక లాభాలు పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. శారీరక కష్టం. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. మానసిక ఆందోళన. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
 

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మీకు అన్ని శుభాలే తెచ్చి పెడుతుంది. గృహమునందు శుభకార్యాచరణ. అవసరములకు మించిన ఖర్చులు. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంతాన అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. రుణ బాధలు కొంతమేర చికాకు తెప్పిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం మధ్యంలో మీరు ఊహించని వార్తలు వింటారు.  వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన కార్యక్రమాలలో అనుకోని ఆటంకాలు ఏర్పడను.ఆకస్మిక ధన లాభం. పెట్టుబడులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు. ఉద్యోగులు పై అధికారులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.
 

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. సంతాన వృద్ధి. వృత్తి వ్యాపారాల యొక్క అభివృద్ధి. అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.  ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలతో ప్రయత్నించిన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.
 

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు.  ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. సోదరులతో మనస్పర్ధలు. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాలకు సామాన్యం. షేర్లు, క్రయవిక్రయాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. సంతాన మూలకంగా లాభం. కోర్టు వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు. వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును. కోర్టు వ్యవహారాల యందు విజయం. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
 

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రుణ బాధలు తీరి ఊరట లభిస్తుంది. సన్నిహిత సహాయ సహకారాలతో ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు.
 

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. . సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. శ్రమాధిక్యం. సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పై అధికారుల మూలంగా చికాకులు.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కుటుంబం నందు శుభకార్యచరణ. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. ఉద్యోగులకు పదోన్నతులు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తలపెట్టిన కార్యములలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. గృహము నందు ప్రతికూల వాతావరణం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. వృతి వ్యాపారాలు స్వల్ప లాభాలు. నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. గృహ నిర్మాణ యత్నాలకు అనుకూలం.
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
సంఘంలో గౌరవ ప్రతిష్టలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. రుణాలు కొంతమేర తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved