ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
ఈ వార ఫలాలు 31.08.2025 నుంచి 6.09.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన విషయాల్లో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరలో కొన్ని పనుల్లో శ్రమ పెరుగుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలం. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
మిథున రాశి ఫలాలు
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో తెలివిగా ప్రవర్తిస్తారు. విద్యార్థులకు అనుకూలం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
సింహ రాశి ఫలాలు
ఇంటా బయటా ఒత్తిడులు పెరుగతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వారం మధ్యలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వాహన యోగం ఉంది.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీరుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం చివరిలో డబ్బు పరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
తుల రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. వారం చివరలో స్నేహితులతో వివాదాలు జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిదికాదు.
ధనుస్సు రాశి ఫలాలు
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా అందరిని మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వారం మధ్యలో వృథా ఖర్చులు పెరుగుతాయి.
మకర రాశి ఫలాలు
బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కుంభ రాశి ఫలాలు
బంధు మిత్రుల సలహాలు కలిసివస్తాయి. ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పనిభారం నుంచి ఉపశమనం దక్కుతుంది. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు తెప్పిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
మీన రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఇంట్లో శుభకర్యాలు నిర్వహిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదులుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.