ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి భార్యగా వస్తే మీకన్నా లక్కీ పర్సన్ మరొకరు ఉండరు!
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తకు, అత్తింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు. వారు అడుగుపెట్టిన చోట అంతా సంతోషమే ఉంటుంది. భర్తను, కుటుంబాన్ని వీరు చక్కగా చూసుకుంటారు. ఏ తేదీల్లో పుట్టినవారికి ఈ క్వాలిటీస్ ఉంటాయో చూద్దాం.

ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అదృష్టవంతులు?
పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, అభిరుచులు, భావోద్వేగాలు, ప్రవర్తన తీరు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను అంచనా వేయవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి తేదీకి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్త జీవితాన్ని అందంగా మార్చేస్తారు. ఆ తేదీలేంటో ఇక్కడ చూద్దాం.
2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. సున్నితంగా ఉంటారు. కానీ హార్ట్ ఫుల్ గా ఉంటారు. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరిని పెళ్లి చేసుకున్న అబ్బాయి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. వీరు భర్తకు, అత్తింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు.
అదృష్టం వీరి వెంటే...
ఈ 3 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు ఏ ఇంట్లో కోడలిగా కాలు పెడ్తారో.. ఆ ఇంటిపై లక్ష్మీదేవి కృప ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు ఎవరిని బాధ పెట్టరు. కుటుంబంలో ఎప్పుడూ సంతోషం ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరి ప్రేమ పూరిత స్వభావమే అందిరినీ వీరికి దగ్గర చేస్తుంది.
సాయం చేసే గుణం..
ఈ 3 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు వివాదాలకు దూరంగా ఉంటారు. అందుకే వీరికి శత్రువులు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయడానికి ఇష్టపడతారు. వీరికి ఊహశక్తి ఎక్కువ. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువ. కుటుంబాన్ని కాపాడటంలో.. భర్తను ప్రేమించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు.