వార ఫలాలు: ఓ రాశివారు ఈ వారంలో శుభవార్తలు వింటారు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రులతో తత్ సంబంధాలు మెరుగు పడతాయి.
Daily Horoscope
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గును. ఉద్యోగము నందు పై అధికారుల ఒత్తిడిలో ఉంటాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళనకు గురిచేస్తాయి. తలపెట్టిన అన్ని పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రులతో తత్ సంబంధాలు మెరుగు పడతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించును. వారాంతంలో శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది . వృత్తి వ్యాపారములందు ధన లాభం కలుగుతుంది .
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో వాదనల వలన కొత్త సమస్యలు ఏర్పడును. కీలకమైన సమస్యలు బుద్ధిబద్ధంతోటి పరిష్కరించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. చేయ పనులలో ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటాయి.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. కొత్త సమస్యలు వలన చికాకులు ఏర్పడవచ్చు. వారాంతంలో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగం నందు పని ఒత్తిడి లు ఉన్నా అధికమించి ఉత్సాహంగా చేస్తారు.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అనుకూల మార్పులు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వారాంతంలో ఉద్యోగం నందు పని అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యల మీద శ్రద్ధవహించవలెను
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
గృహమునందు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంఘమునందు మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. శరీర ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారమునందు పెట్టుబడులు తగ్గ ధనలాభం కలుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చేస్తారు. వారాంతంలో ఉద్యోగం నందు వడి దుడుగులు గాఉంటుంది. కీలకమైన సమస్యలు పెద్దవారి యొక్క ఆలోచనతోటి పరిష్కరించాలి. ప్రయాణాల యందు తగు జాగ్రత్త తీసుకొని వలెను.
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో నందు పెట్టుబడులను పెద్దవారి యొక్క సూచనలు మేరకు పెట్టుబడి పెట్టవలెను. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకోవాలి. మనసునందు ఆందోళన ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గును. గృహమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చును. వారాంతంలో పెట్టుబడులు తగ్గ ధనలాభం పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు ఏర్పడతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగము నందు సహోద్యోగులు సహాయ సహకారాలు అందుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది .
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మృదువుగా మాట్లాడవలెను. బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును. మానసికంగా బలహీనంగా ఉంటుంది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జీవిత భాగస్వామితోటే సఖ్యతగా ఉండవలెను. వారాంతంలో శుభకార్యాల్లో పాల్గుంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. శరీర ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. దైవ కార్యక్రమాల్ని నిర్వహించారు. వ్యాపార యందు ధన లాభం కలుగుతుంది .మీ ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారములు నందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. వారాంతంలో వాదనలకు దూరంగా ఉండండి .అనవసర ఆలోచనలతోటి సమయాన్ని వృధా చేయకండి. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో ధైర్యంగా ముందడుగు వేయండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా పడండి.
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులన్నీ కూడా పట్టుదలతోటి పూర్తి చేయాలి. నిరాశ నిస్పృహలకు గురవుతారు . వ్యాపారం నందు పెట్టుబడుల యొక్క విషయంలో పెద్దల యొక్క సూచనలు తీసుకుని ఆచరించడం మంచిది. ఆరోగ్యామనందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్త తీసుకొని వలెను . వారాంతంలో కీలకమైన సమస్యలలో ప్రశాంతంగా ఆలోచించి తీసుకొని వలెను. దురాలోచనలకు దూరంగా ఉండండి.అన్నదమ్ములతో మనస్పర్ధలు ఏర్పడగలరు
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈవారం శారీరకంగా మానసికంగా బాగుంటుంది. కీలక వ్యవహారాలు యందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరిస్తారు. తలపెట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి . పెట్టిన పెట్టుబడులు తగ్గ ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అనుకూల మార్పులు చేర్పులు. వారాంతంలో ఆరోగ్య సమస్యలు చికాకు పుట్టించును. కొన్ని సమస్యలు వలన ఆవేశానికి గురవుతారు .
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అనవసర విషయాల తోటి సమయం వృధా చేయకండి. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. వ్యాపారం నందు లాభంసామాన్యంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వారాంతంలో తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి.ఆరోగ్యమునందు తగు జాగ్రత్త తీసుకోవాలి .వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి నీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతోటి నూతన ప్రయత్నాలకు గురించి చర్చిస్తారు.వ్యాపారం లాభసాటిగా జరుగుతాయి. తలపెట్టిన పనులన్నీ విజయం చేకూరును . వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్నన లభిస్తుంది.వారాంతంలో జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాలు పరిష్కార మగును. స్థిరాస్తి వృద్ధి చేయు ప్రణాళికలు చేస్తారు. ఇంటా బయట కలహాలు ఏర్పడును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగవనందు అధిక పని ఏర్పడవచ్చును. శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. వ్యాపారం నందు ధన లాభం చేకూరును . తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వారాంతంలో అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కీలకైన విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సమస్యలు మానసికంగా కృంగతీయును. వివాదాలకు వాదనలకు దూరంగా ఉండండి.మీ దగ్గర పని వారిచే ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన బకాయిలు వసూలు చేసుకోవాలి. సోదరులతోటి కొద్దిపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చును