MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ వారం ఓ రాశివారు చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!

ఈ వారం ఓ రాశివారు చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 30.11.2025 నుంచి 6.12.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Nov 30 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : AI

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఇంట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

Related image1
AI జాతకం: కన్య రాశివారికి 2026లో ఎలా ఉండనుంది? AI ఏం చెప్పిందో తెలుసా?
Related image2
AI జాతకం: 2026లో సింహ రాశివారి జీవితంలో ఏం జరగబోతోంది? AI ఏం చెప్పింది?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. వాహన వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. 

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు కొంత తీరుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

నూతన వ్యవహారాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికి నచ్చే విధంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. 

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. శత్రు పరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది. 

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యులు సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. 

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. 

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణాలు చేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
AI జాతకం: కన్య రాశివారికి 2026లో ఎలా ఉండనుంది? AI ఏం చెప్పిందో తెలుసా?
Recommended image2
AI జాతకం: 2026లో సింహ రాశివారి జీవితంలో ఏం జరగబోతోంది? AI ఏం చెప్పింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved