- Home
- Astrology
- Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి నుంచి స్థిరాస్తి లాభం కలుగుతుంది!
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి నుంచి స్థిరాస్తి లాభం కలుగుతుంది!
Weekly Horoscope: ఈ వార ఫలాలు 28.12.2025 నుంచి 03.1.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణకు మార్గం సుగమమవుతుంది. అప్పులు కొంతవరకు తీరుస్తారు. వారాంతంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయటా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి.
మిథున రాశి ఫలాలు
ఆప్తుల నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా అనుకూలం. అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
కర్కాటక రాశి ఫలాలు
దూరప్రాంతాల వారి నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆప్తుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా అందుకుంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలోఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో తగినగుర్తింపు లభిస్తుంది.
సింహ రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు సందిగ్ధంలో పడేస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేస్తారు. బంధువుల మాటలు మానసికంగా భాదిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరాక నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
కన్య రాశి ఫలాలు
బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. సంఘంలో పెద్దల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలను అందరు గౌరవిస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం అందుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో అవరోధాలు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
ప్రయాణాలలో పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి దీర్ఘ కాలిక అప్పులు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.
ధనుస్సు రాశి ఫలాలు
స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. మిత్రులతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడి నుంచి బయట పడతారు. వృత్తి, వ్యాపారాలలో సన్నిహితుల సలహాలతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉతీర్ణత సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు.
మకర రాశి ఫలాలు
సంఘంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక రుణ సమస్యలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుంచి స్థిరాస్తి లాభం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. స్థిరాస్తి వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో గృహ నిర్మాణాలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి.
మీన రాశి ఫలాలు
నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. ఇంటా బయటా ఉత్సహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.

