MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Your Weekly Horoscopes:ఓ రాశివారు ఈ వారం విహారయాత్రలకు వెళతారు...!

Your Weekly Horoscopes:ఓ రాశివారు ఈ వారం విహారయాత్రలకు వెళతారు...!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో  ఉద్యోగులకు స్థానచలనం. చేతివృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది  పెడుతున్న  సమస్యలకు పరిష్కార మార్గం లభించును. 

5 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Daily Horoscope 2022 21

Daily Horoscope 2022 - 21


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

 మ్యాజికల్ వారంకు రెడీ అవ్వండి!  శృగారం,సృజనాత్మకత విషయాల్లో ఎల్లలు దాటేస్తారు . నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.  ఆస్తి విషయంలో ఏర్పడిన చిక్కులు తొలగును. ఉద్యోగులు పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు.సంఘంలో కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగి ఆనందంగా గడుపుతారు.రుణ శత్రుబాధలు ఉన్నప్పటికీ అంతగా బాధించవు. బంధుమిత్రుల సహకారం సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో కొంత వరకు రుణం చేయవలసి రావచ్చు.ధనాదాయం మార్గాలు బాగుంటాయి.

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

28 వ తేదీ నుంచి మీ వృత్తి, వ్యవహారాల్లో కొత్త అవకాశాలు కనపడటం మొదలవుతుంది.  తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో  ఉద్యోగులకు స్థానచలనం. చేతివృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది  పెడుతున్న  సమస్యలకు పరిష్కార మార్గం లభించును. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను. వారాంతంలో కొంతమేర ఆర్థిక ఇబ్బందులు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం.చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నారు రుణ సమస్యలు కొంత వరకు ఉపశమనం కలిగించును.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ వారం “మీరు విజయాన్ని అందుకోవటానికి సిద్దంగా ఉండండి.”. జీవన విధానం సాఫీగా ఉండును. కష్టనష్టాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. రుణబాధలు కొంతవరకూ తీరును. దీర్ఘకాలిక రోగాల నుండి కొంత వరకు ఉపశమనం. బంధుమిత్రులతో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో ప్రతికూలమైన వాతావరణం. కుటుంబము నందు తగిన జాగ్రత్తలు వహించాలి. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో సామాన్యం. ఆదాయ మార్గాలు కలిసిరాకపోవుట. అనవసరమైన ఖర్చు చేస్తారు.  ప్రయాణాలలో చోర భయం. వారాంతంలో కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమవుతాయి.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

“మీరు ఓ అద్బుతమైన టీమ్ లో ఓ భాగం కాబోతున్నారు. ”. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. సామాన్య జీవన విధానం.పోయిన ధనాన్ని తిరిగి రాబట్టుకుంటారు. దేవాలయ సందర్శన. ఇతరులకు సహకారం చేసే మనస్తత్వం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపు.  వృత్తి వ్యాపారులకు ధనలాభం. ఉద్యోగులకు ప్రమోషన్లు. స్థిరాస్తి క్రయ విక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది.
 

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

మీకు ప్రియమైన వారు చాలా కాలం తర్వాత మీతో పూర్తి స్దాయిలో మనస్సు విప్పి ముందుకు వస్తారు. మీ రిలేషన్ షిప్ లో కొత్త ఆనందాలు చూస్తారు. రావలసిన బాకీలు వసూలు అగును. అనుకున్న పనులు అతికష్టం మీద పూర్తగును. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నదమ్ములతో కలహాలు. వ్యాపారము నందు చేయి పనివారితో ఇబ్బందులు. ధనాదాయం మార్గాలు సామాన్యం. కుటుంబ వృద్ధి కోసం తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. నిరుద్యోగులకు ఆటంకాలు. వివాహ ప్రయత్నాలు నిరాశపరచును.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
 
మీరు ఎంత స్ట్రెస్, ప్రస్టేషన్ , విసుగులో కోల్పోయిన  ప్రేమ, రిలేషన్ షిప్స్ తిరిగి మీ చెంతకు చేరే వారం ఇది. మీరు వాటిని ఆహ్వానించి, అపురూపంగా చూసుకోవాలి.  ఆదాయ మార్గాలు బావుంటాయి.కుటుంబము నందు సంతోషం. శారీరక కష్టం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో సానుకూలం. వాహన విలువైన వస్తువులను కొంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రు,రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి.
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

మీ బిజినెస్ లేదా వ్యక్తిగత జీవిత పార్టనర్ లో పూర్తి స్దాయి పొటిన్షియల్ ని మీరు చూడగలిగే సిట్యువేషన్స్ క్రియేట్ అయ్యే వారం ఇది.  దాంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు.వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో పెద్దవారికి ఒక ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ శత్రు బాధలు తొలగును. సంతానం మూలకంగా లాభం. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. తలపెట్టిన పనులలో జాప్యం.పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును. వారాంతంలో అనుకోని ఖర్చులు. 
 

913


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

ఇది మీకు ఓ గొప్ప వారం కాబోతోంది. మీ బోయ్ ప్రెండ్ లేదా గర్ల్ ప్రెండ్ లేదా , మీ భార్యతో వెకేషన్ కు వెళ్తారు. అక్కడ మీరు ఊహించని కొత్త అనుభూతులు చవిచూస్తారు.  ఉద్యోగస్తులకు పదోన్నతులు అనుకూలం. ప్రయాణాలు కలిసొస్తాయి.వృత్తి  వ్యాపారులకు అనుకూలం. అన్నదమ్ములు సహాయ సహకారాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. ఆకస్మిక ధన లాభం. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రుణ శత్రు బాధలు కొంతమేర ఇబ్బంది. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం.జీవన విధానం సాఫీగా సాగును.

1013


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

“మీరు ఓపెన్ హార్ట్ తో ఉన్నప్పుడు మాత్రమే పనులు ముందుకు వెళ్తాయి.”. ఈ వారం మీరు పదే పదే గుర్తు చేసుకోవాల్సిన మాటలు ఇవి.  లేకుంటే ఆర్థిక ఇబ్బందులు. నిరుద్యోగులకు నిరాశ. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి.బంధుమిత్రులతో కలహాలు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఈ వారం జీవన విధానం సామాన్యం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. స్థిరాస్తి క్రయ విక్రయాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో పెద్దవారికి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రుణ శత్రు బాధలు తొలగును. తలపెట్టిన కార్యాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

మీ రాశి ప్రయాణంలో జరిగే కొన్ని మార్పులు వలన  మీరు రిలేషన్ షిప్ లో కత్త డైనమిక్స్ ని చూస్తారు.  మీ ప్రేయసి లేదా మీ భార్య లేదా భర్త వైపు నుంచి ఊహించని గొప్ప మార్పు గమనిస్తారు. అది అనుకూలంగా మార్చుకుంటే మీ జీవితం మామూలుగా ఉండదు.   ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూలమైన బదిలీలు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతం. సంఘంలో  కీర్తి ప్రతిష్టలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు. శారీరక శ్రమ. రుణ శత్రు బాధలు కొద్దిగా బాధించును. గృహము నందు ప్రతికూల వాతావరణం.వృత్తి వ్యాపారాలయందు సామాన్యంగా ఉంటుంది.తలపెట్టిన పనులువాయిదా పడతాయి.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

గతంలో మీకు కలిసిరాని శృంగార జీవితం ఇప్పుడు ఓ గాడిన పడుతుంది. కొత్త సిట్యువేషన్స్ సరికొత్త మార్పులకు దారి తీస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో పేరుప్రతిష్టలు.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. సంతాన అభివృద్ధికి తగు నిర్ణయాలు తీసుకుంటారు.అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.స్థిరాస్తి కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి.ఉద్యోగులకు పదోన్నతులు బదిలీలు విషయంలో సానుకూలం.వృత్తి వ్యాపారాలలో సామాన్యం. తలపెట్టిన కార్యక్రమాలు వారాంతంలో పూర్తి చేస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈ వారం ఒకటే గుర్తు పెట్టుకోండి  no risk, no reward. ఇదే మీకు కొత్త దారులు చూపుతుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. విద్యార్థులకు అనుకూలం. రుణ శత్రు బాధలు తగ్గుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved