Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • వారఫలాలు: ఓ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి

వారఫలాలు: ఓ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  గృహమునందు శుభకార్యములు నిర్వహించారు. వృత్తి వ్యాపారముల యందు ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి  కార్యక్రమాల ఆలోచనలు ఫలిస్తాయి. 

ramya Sridhar | Updated : Sep 24 2023, 10:05 AM
7 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Asianet Image

వార ఫలాలు :24 సెప్టెంబర్  2023 నుంచి 30 సెప్టెంబర్ 2023 వరకూ

  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం చంద్రుడు రాజ్యస్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతుతారు. అధికారుల యొక్క ఆదర  అభిమానములు లభించును. విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలించును. గృహమునందు శుభకార్యములు నిర్వహించారు. వృత్తి వ్యాపారముల యందు ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి  కార్యక్రమాల ఆలోచనలు ఫలిస్తాయి. వచ్చిన అవకాశాల్ని అశ్రద్ధ చేయకుండా అందిపుచ్చు కొనవలెను.సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం చంద్రుడు భాగ్యస్థానం నందు సంచారం. ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు కలుగును.అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది.వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. చేయి పని యందు శారీరక శ్రమ పెరిగి బలహీనత పొందుతారు. జీవిత భాగస్వామి తోటి మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. చేయి వ్యవహారము నందు అవరోధాలు ఎదురైనా వాటిని సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ వ్యవహారములను పూర్తి చేయాలి.నిరాశ నిస్పృహలకు గురి అవుతుంటారు .వ్యాపారం నందు పెట్టుబడుల యొక్క విషయంలో పెద్దల యొక్క సూచనలు తీసుకొనివలెను.ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణమునందు జాగ్రత్త వహించాలి .

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు:-(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈవారం చంద్రుడు అష్టమ స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడును. మానసిక ఉద్రేకతలు. వ్యాపారాలు మందకొడిగా నడుచును. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అవసరము. అతి కష్టం మీద తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజము నందు ఆచితూచి వ్యవహరించవలెను. మానసిక శారీరక బాధలు రాగలవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు తో ప్రతికూలత వాతావరణం. విరోధాలకు కలహాలుకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురై మానసిక ఉద్రేకతులకు దారి తీయను. స్థిరాస్తి విషయాలు ప్రతికూలంగా ఉండును. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించవలెను. వృత్తి ఉద్యోగంలో అనుకూలతలు తక్కువ.సమస్యాత్మక అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2


ఈవారం చంద్రుడు కళత్ర స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు.గృహమున కళ్యాణాది శుభ కార్యక్రమాలు జరుగును. కుటుంబ విషయాల్లో సంతృప్తిని పొందుతారు. నూతన వస్తు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు నుండి బయట పడతారు. మిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయ  మార్గాలు పెరుగుతాయి.  జీవన విధానం గౌరవప్రదంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అపార్థాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది.సమస్యల నుండి బయట పడతారు.నీకు రావలసిన ధనము కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన చివరకు లభిస్తుంది. ఉద్యోగము నందు ఉన్నత స్థితి పొందగలరు. సంతోషకరమైన వార్తలు వింటారు.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ వారం చంద్రుడు శత్రు స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయి. ఇంటా బయట మీదే పే చేయగా ఉంటుంది. వృత్తి వ్యాపారము నందు ఉన్నటువంటి చికాకులు తొలగి లాభసాటిగా ముందుకు సాగుతారు. కేసులు తీర్పులు మీకు అనుకూలంగా ఉండును.ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. విద్యార్థులకు విద్య సంబంధమైన విషయాలు అనుకూలం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు  కలిసి వస్తాయి. కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలను తగిన గుర్తింపు లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5


ఈవారం చంద్రుడు పంచమ స్థానమునందు సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు కలుగును.చేయు పనులలో అశ్రద్ధ పెరిగి ఆటంకముల ఏర్పడను.అనారోగ్య సమస్యలు రాగలవు.ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకున్నట మంచిది. శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు ఏర్పడతాయి. తీర్పులు కేసులు వలన మానసిక ఒత్తిడులు పెరుగుతాయి . కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని దీర్ఘాలోచన  చేసిన పరిష్కార మార్గాలు దొరుకును . చేయు పని యందు ఓర్పు సహనం తోటి చేయవలెను. సమాజం నందు అపనిందులు రాగలవు. అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ వారం చంద్రుడు చతుర్థ స్థానమునందు సంచరించిను. ఈ సంచారం వలన దోష ఫలితాలు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు.పగ ప్రతీకారాలకు దూరంగా ఉండాలి. వ్యాపారం నందు లాభాలు కష్టపడి సాధించవలసిన పరిస్థితి. కుటుంబము నందు ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తలు తీసుకొన వలెను. చిన్న కారణాలు పెరిగి పెద్దదై భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఉద్యోగపరంగా  చికాకులు ఏర్పడతాయి. సంతానం చదువు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సంఘములో పరిస్థితులు మనోవేదనకు కారణం అవుతాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. ఊహించని విధముగా ఆదాయ మార్గాలు తగ్గును. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది.ఖర్చులు యందు ఆచూతూచి చేయవలెను.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9


ఈ వారం చంద్రుడు తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.అనుకోకుండా జరిగే సంఘటనలు మీకు లాభిస్తాయి.ఉద్యోగ అభివృద్ధికి చేయు ఆలోచనలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో వారికి నూతన అవకాశాలు  కలిసి వస్తాయి. ప్రారంభించి ఆగిపోయిన పనులు మరల ప్రారంభిస్తారు. చేతి వృత్తి చేయువారికి విశేష ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి చేయు ప్రణాళికలు కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు యందు పెద్దల యొక్క సూచన మేరకు ముందడుగు వేయవలెను.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రములు:-(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ వారం ధన స్థానము నందు చంద్ర సంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు.అనుకోని కారణాల చేత సమాజము నందు మీ పరపతి తగ్గును. ఆత్మీయుల చేత మనస్పర్ధలు రాగలవు. సమస్యల ‌‌యందు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలెను. నిష్కారణమైన తగాదాలు కలహాలు ఏర్పడవచ్చు.ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.సంతానము తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తగు సమయానికి ఏదో ఒక రకంగా ధనం చేతి కందుతుంది. మిత్రుల వలన కొంత పెడదోవ పెట్టే అవకాశం. కేసులు యందు వాయిదాల మీద వాయిదాలు పడుతూ చిరాకు పుట్టించును. కొన్ని విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన సంభాషణలతోటి కాలయాపన చేస్తారు. చేయి ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. ఉద్యోగము నందు అధిక ఒత్తిడికి గురికావడం జరుగును.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రములు:-(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈవారం చంద్రుడు జన్మ రాశి లో సంచరించును. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఉద్యోగ సంబంధమైన విషయాలలో  మంచి మార్పులు రావచ్చును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి బంధుమిత్రులతో కలిసి చర్చిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం లభించును. ఆరోగ్య  కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతారు.వృత్తి వ్యాపారము నందు మంచి లాభాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. రాణి బాకీలు లౌక్యం తోటి వసూలు చేసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు బాగా రాణిస్తారు. సహోదర సహోదరీ వర్గం తోటి తత్ సంబంధాలు బలపడతాయి. సంతానాని వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ వారం గోచార రీత్యా చంద్రుడు వ్యయ స్థానం నందు సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.కుటుంబ కలహాలు రాగలవు. సమస్యల యందు తొందరపాటు నిర్ణయాలు లేకుండా సమస్యలను చక్క పెట్టవలెను. వాద ప్రతివాదములకు దూరంగా ఉండడం మంచిది.  కొన్ని సంఘటనలు వలన ఉద్రేకత మానసిక ఆవేదన పెరుగును. మిత్రులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక పరిణామాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. స్థిరాస్తులు క్రయ విక్రయాల యందు ప్రతిబంధకాలు ఏర్పడును. ఉద్యోగము నందు అధికారులతోటి మనస్పర్ధలు రావచ్చును. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం కలుగుతుంది. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా సామాజికంగా బలహీనపడతారు.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు:-(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ వారం చంద్రుడు లాభ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.ఈ వారం లాభసాటిగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు యందు ఊహించని ధన లాభం పొందుతారు.కుటుంబ అభివృద్ధి కోసం తీసుకున్న  నిర్ణయాలు ఫలిస్తాయి. కీలకమైన సమస్యల యందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. శుభకార్యాలలో పాల్గొంటారు.  అనవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అవాంతరాలు ఏర్పడును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories