MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • వారఫలాలు: వారంలో ఈ రాశివారికి ఊహించని ధన లాభం

వారఫలాలు: వారంలో ఈ రాశివారికి ఊహించని ధన లాభం

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం మొదట్లో కాస్త చిరాగ్గా ఉన్నా..రాను రాను అన్ని సానుకూలం అవుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది.

5 Min read
Author : ramya Sridhar
Published : Aug 21 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ వారం మీకు చాలా బాగుంది. కలిసొస్తుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు.దానధర్మాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు . ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో జాప్యం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ అభివృద్ధి. కుటుంబ వృద్ధి కోసం తగు నిర్ణయాలు తీసుకుంటారు. విఘ్నేశ్వరుడు ను పూజించండి. 

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఈ వారం మొదట్లో కాస్త చిరాగ్గా ఉన్నా..రాను రాను అన్ని సానుకూలం అవుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.  కుటుంబము నందు చికాకులు. అనవసరమైన ప్రయాణాలు. సంఘము నందు కలహాలు. క్రయవిక్రయాలలో లాభాలు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి. దేవాలయ సందర్శన. ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ వారం మీ దృష్టి ఆధ్యాత్మకత వైపు మరులుతుంది. దేవాలయదర్శనం చేయండి.  ధర్మ కార్యాచరణ చేస్తారు. ఆపదలు ఏర్పడును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గ్రహం నందు శుభకార్యా చరణ. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభాలు. రుణ బాధలు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

ఈ వారం మీ జీవితంలో చాలా మార్పులకు దారి తీసే సంఘటనలు జరుగుతాయి. ధన ధాన్య వృద్ధి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు. గృహ నిర్మాణాలకు అనుకూలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉండటంతో ఊరట చెందుతారు. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వాహన సౌఖ్యం.  శివాలయాన్ని దర్శించండి.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

ఈ వారం మీరు అన్ని విషయాల్లో మెలకవగా ఉండాలి. మంచి,చెడులకు సమానంగా స్పందంచాలి. వస్తు,వాహన ప్రాప్తి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సంఘమునందు తెలివిగా వ్యవహరించవలెను. అధిక ఖర్చులు. వృత్తి వ్యాపారములకు అనుకూలం. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ప్రయాణ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు. వివాహ ప్రయత్నాలలో ఆలస్యం. స్థిరాస్తి క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

మంచి కాలం ఈ వారం. ప్రతీ రోజు మీకు కొన్ని ఊహించని మార్పులు తెలియకుండా చోటు చేసుకుంటాయి. అందులో ముఖ్యంగా గృహం నందు శుభకార్యాలు.సంఘము నందు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. సోదరుల సహకారంతో పనులలో విజయం సాధిస్తారు. ఆందోళనగా ఉంటుంది.  చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అనుకోని కలహాలు. శుభకార్యాల వలన ధన వ్యయం. బంధుమిత్రుల కలయిక. ఉద్యోగం నందు పై అధికారుల ఒత్తిడి. ఇతరులకు సహాయం చేస్తారు. వారాంతంలో ధనలాభం. ఆంజనేయ దండకం పఠించండి
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

ఈ వారం మధ్యస్దం.  కొన్ని మీకు కలిసొస్తే..మరికొన్నిఇబ్బందులు మిమ్మల్ని వెన్నంటే ఉంటాయి. రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. గృహం నందు శుభకార్యాచరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుంటారు.అనుకున్న పనులలో ఆటంకాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సోదరులతో మనస్పర్ధలు. సంతానమునకు విద్యా ఉద్యోగ అభివృద్ధి. ఆరోగ్య, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

ఈ వారాన్ని మీరు మీ తెలివితో,సమయస్పూర్తితో మంచిగా మార్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే అంతా శుభమే. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. సంఘమునందు గౌరవం. రుణ శత్రు బాధలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మనసు నందు ఆందోళన. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగము నందు చికాకులు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

 మీ జీవితకాలం తీరని కొన్ని సమస్యలకు ఈ వారం మార్గం దొరుకుతుంది. పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మనసు చాంచల్యం. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సంతాన మూలకంగా లాభాలు. స్థిరాసి క్రయవిక్రయాలకు అనుకూలం. ఉద్యోగులకు అధికార ప్రాప్తి. రుణ శత్రు బాధలు తీరి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. లక్ష్మీ దేవిస్తోత్రాలు పఠించండి.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

ఈ వారం మీకు అన్ని విధాల శుభం. వేరే ఆలోచన చేయకుండా ముందుకు వెళ్లిపోండి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వృత్తి వ్యాపారం యందు లాభాలు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. మనసునందు ఆందోళన. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు తొలగి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలకు అనుకూలం. రుణ బాధలు తీరి ఊరట పొందుతారు. బంధుమిత్రుల కలయిక. దుర్గామాత అర్చనలు మంచిది.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

ఈ వారం మీకు పూర్తి అనుకూలం..అయితే కొన్ని సమస్యలు మీకు ఎదురౌతాయి. వాటిని మీకు ఇష్టమైన భగవత్ నామ స్మరణతో దాటే ప్రయత్నం చేయండి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు.బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘము నందు కీర్తి. ధన వస్తు వస్త్ర ప్రాప్తి. వృత్తి వ్యాపారములు యందు లాభం. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వారాంతంలో గృహమునందు శుభకార్యాచరణ. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు ఆలయాన్ని దర్శించండి.

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారం మీరు ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న శుభ వార్తలు వింటారు. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.బంధుమిత్రుల కలయిక. ఆకస్మిక ధన లాభం. ఉద్యోగాభివృద్ధి. సంఘంలో గౌరవం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. గృహమునందు శుభకార్యాలు. మిత్రులు,నమ్మిన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంఘంలో తెలివిగా వ్యవహారం చేస్తారు. ఉద్యోగం నందు కొన్ని ఇబ్బందులు. ఆరోగ్య, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved