MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలాలు: ఓ రాశి వారికి వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు

వారఫలాలు: ఓ రాశి వారికి వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం షష్ఠమాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానం, లాభ స్థానము లో సంచారం. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. 

8 Min read
Author : R Shivallela
Published : Oct 15 2023, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి ఈ వారం చతుర్దాది పతి అయిన చంద్రుడు కళత్ర స్థానము మరియు  భాగ్యస్థానము లో  సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభించును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం చేకూరుతుంది. ఇతరుల విషయాలలో దూరంగా ఉండవలెను. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభించును. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు లభించును. విలాసవంతమైన జీవితం గడుపుతారు.సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో  శారీరక పీడ. అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది. మానసిక భయాందోళన.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈ వారం తృతీయాధిపతి అయిన చంద్రుడు శత్రు స్థానం మరియు ఆయుః స్థానం లో సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సన్మానాలు బహుమానాలు అందుకుంటారు. అందరితో మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాలను చక్కపెట్టుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.కొద్ది రోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము లో ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో  మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతో వాదోపవాదమునలకు దూరంగా ఉండటం మంచిది.


 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు:-(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ఈ వారం ధనాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానము  మరియు కళత్ర స్థానము లో సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు. అనవసరపు ఖర్చులు అధికంగా ఉండును. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త వహించవలెను. అపకారం చేసేవాళ్లు పెరుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహిత సంబంధాలు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండటం మంచిది.మానసికంగా భయంగా ఉండును. చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము లో అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.వారాంతం లో  సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది.సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వ్యాపారము లో ధన లాభం పొందగలరు.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారికి జన్మరాశ్యాధి పతి అయిన చంద్రుడు ఈ వారం చతుర్థ స్థానము మరియు శత్రు స్థానంలో  సంచరించిను. ఈ సంచారం వలన ఇబ్బందులు కలుగును.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. పనులలో ఆతురత పెరిగి ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అవమానాలు ఎదురవగలవు. రుణాలు చేయవలసి వస్తుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.కొద్దిపాటి చికాకులు తప్పవు.  ఆర్థిక లావాదేవీలు స్తబ్దత. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. వారాంతం లో నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ రాశి వారికి ఈ వారం వ్యయాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానము   మరియు పంచమస్థానం లో సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. బందు మిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బలపడతారు. వ్యవహారాలలో సమయానుకూల సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో అభివృద్ధి చర్చలు జరుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాలు అనుకూలంగా ఉండును. చేయు పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాల లభిస్తాయి.నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. ధైర్య సాహసాలతోటి కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ఈ వారం లాభాధిపతి అయిన చంద్రుడు ధన స్థానము  మరియు మాతృ స్థానము లో చంద్ర సంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. చేయు వ్యవహారాల్లో కోపావేషాలు తగ్గించుకుని వ్యవహరించవలెను. కొద్దిపాటి కష్టనష్టాలు రాగలవు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు. వాద వివాదాలకు దూరంగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు పెరుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.ఉద్యోగాలలో సమస్యలు రాగలవు .ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుంచి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు .వారాంతం లో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈ వారం రాజ్యాధిపతి అయిన చంద్రుడు జన్మ రాశి లో  మరియు తృతీయ స్థానము లో సంచరించును. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు.సమాజంలో ప్రముఖుల తో పరిచయాలు కలసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.  కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి చేయగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన ధన లాభం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు.తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు . ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో  తలచిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి ఈ వారం భాగ్యాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానం మరియు ధన స్థానము లో  సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. మిత్రుల తోటి అకారణంగా కలహాలు రాగలవు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఒక విషయం వలన మానసక ఆందోళన పెరుగును. శారీరక కష్టం పెరిగి బలహీనముగా నుండును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు. ఇతరుల ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండవలెను. సమాజం నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజములో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం లో అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజములో ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి ఈ వారం అష్టమాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానము  మరియు జన్మరాశి  లో    సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు.ఆర్థికంగా బలపడతారు. అధికారుల ఆదర అభిమానాల పొందగలరు. అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజములో గౌరవ మర్యాదలు పొందగలరు.
ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు.అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.వారాంతం లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు.సమాజము లో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి ఈ వారం కళత్రాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానము మరియు వ్యయస్థానము లో సంచారము . ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. కొంత కాలముగా మనసులో ఉన్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆనందం శారీరక సౌఖ్యం పొందగలరు. ఆధ్యాత్మిక చింతన పెరుగును. కీలకమైన సమస్యలు పరిష్కారమగును.అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం.కష్ట పడిన శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వివాదాలు కేసులు  పరిష్కారం మగును.వ్యాపారాలలో లాభాలు పొందగలరు .ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.దైవ కార్యాలు లో పాల్గొంటారు. పాత బాకీలు  వసూలవుతాయి. విందు వినోదాల లో పాల్గొంటారు.వారాంతం లో  సమాజము లో అవమానాలు కలగవచ్చు.తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి ఈ వారం షష్ఠమాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానం  మరియు లాభ స్థానము లో సంచారం. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుంచి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు.వ్యాపారాలు మందకొడిగా సాగును. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.వారాంతం లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి ఈ వారం పంచమాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానము  మరియు రాజ్యస్థానము లో సంచారం.ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. మిత్రుల తోటి అకారణంగా కలహాలు రాగలవు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఒక విషయం వలన మానసక ఆందోళన పెరుగుతుంది. శారీరకంగా బలహీనముగా నుండును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు. ఇతరుల ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండవలెను. సమాజం నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేయవలసి వస్తుంది. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.వారాంతం లో అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగాలలో అధికారవృద్ధి పొందగలరు.

About the Author

RS
R Shivallela
జ్యోతిష్యం
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved