ఈ వారం ఓ రాశివారికి ఆదాయం పెరుగుతుంది.. అప్పులు తీరుతాయి!
Weekly Horoscope: ఈ వార ఫలాలు 14.09.2025 నుంచి 20.09.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దూరప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
మిథున రాశి ఫలాలు
ఆర్థికంగా కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. వృత్తి, ఉద్యోగాలు సాధారణం. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి ఫలాలు
కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరప్రాంత బంధువులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. వారాంతంలో వృథా ఖర్చులు పెరుగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కాస్త చికాకు వాతావరణం ఉంటుంది. వారాంతంలో అనుకోని సమస్యలు రావచ్చు.
కన్య రాశి ఫలాలు
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వారం చివరన ఖర్చు పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి.
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్నివిషయాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మకర రాశి ఫలాలు
ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో డబ్బు పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
కుంభ రాశి ఫలాలు
కుటుంబ వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చవు. కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాల్లో చికాకు వాతావరణం ఉంటుంది. వారం మధ్యన కొన్ని పనుల్లో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మీన రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు లాభాలు కురిపిస్తాయి. ఉద్యోగులకు పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.