MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఓ రాశివారికి జీవిత భాగస్వామి నుండి ఊహించని బహుమతి

వార ఫలాలు: ఓ రాశివారికి జీవిత భాగస్వామి నుండి ఊహించని బహుమతి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగం నందు అధికారుల  ఒత్తిడుల నుంచి బయటపడతారు.

8 Min read
Author : ramya Sridhar
Published : May 14 2023, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు :14 మే  2023 నుంచి 20   మే  2023 వరకు
 
 
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
వ్యాపార భాగస్వాముల  పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను.  ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.  రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబసభ్యుల తోటి కలహాలు ఏర్పడగలవు. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఏర్పడ గలవు. ప్రత్యర్థుల తోటి జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. రావలసిన బాకీలు లౌక్యంగా రాబట్టవలెను. మిత్రులతోటి మనస్పర్ధలు రాగలవు.  మనస్సునందు భయంగా ఉండును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. వారాంతంలో వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితా లను ఇస్తాయి.లాభాలు ఆశించిన స్థాయిలో పొందగలరు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
కొత్త విషయాలు తెలుసుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు. భూ గృహ స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగును. కొంత కాలంగా పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. అనుకోని అవకాశాలు అప్రయత్నంగా లభించును.తలపెట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగం నందు అధికారుల  ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.  సమస్యలు వివాదాలు పరిష్కారం అగును. కీలకమైన నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు సూచనలు తీసుకొనుట మంచిది.  స్థిరాస్తి విషయంలో ఆచితూచి అడుగు వేయవలెను. వృత్తి వ్యాపారులు  లాభసాటికా జరుగును.ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందగలరు.  వివాహ ప్రయత్నాలు సఫలీకతమవుతాయి. వారాంతంలో కుటుంబమునందు చికాకులు అధికముగా ఉండును. 
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు శ్రమ అధికముగా వుండును. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉంటుంది.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలు లో పాల్గొంటారు.  బంధుమిత్రులతోటి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించును. ఉద్యోగమునందుఅధికారుల ఆదర అభిమానములు పొందగలరు.శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండవలెను. ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వారాంతంలో పనులు యందు ఆలస్యము. మానసిక ఒత్తిళ్ళు,  శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు పాటించవలెను.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
ఆర్థిక ప్రయత్నాల్లో ప్రతి కూలత వాతావరణ. కీలకమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయ సహకారములుతో పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరము. ఆరోగ్యం కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉంటుంది . ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడిలు పెరుగును. శారీరక కష్టం పెరుగును. తలచిన పనులలో అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలకు వివాదాలకు దూరంగా ఉండవలెను. ఆదాయం మించి ఖర్చులు పెరుగుతాయి. వాహనాల ప్రయాణం నందు జాగ్రత్త అవసరము. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వారాంతంలో  సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రుణబాధల నుంచి విముక్తి పొందగలరు. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.  అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.అనవసరమైన ఆలోచనలు కలుగును. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును. వివాదాల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక విషయాలలో  నిరుత్సాహంగా ఉండను. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.  ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా నుండను. కొన్ని సందర్భాల్లో ఉన్న సహకారం కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. మానసిక అశాంతి ఏకాగ్రత లేకుండా ఉండటం జరుగును. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. వారాంతంలో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండగలవు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి  ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు వలన పనులు పూర్తి అగును. సమాజము నందు మాట చెల్లుబాటు అవుతుంది.రావలసిన డబ్బు అందుతుంది. ఉద్యోగులకు పై అధికారుల అండదండలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బలపడతారు. వస్తు వాహన సౌకర్యాలు ఏర్పడగలవు. శారీరక మానసిక ఆనందములు పొందగలరు. ఇతరులతో సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉదోగ్యస్తులు తమ యొక్క  విధిని సక్రమంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారములు సజావుగా సాగును. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును. సంతానం కోసం అధిక దనాన్ని ఖర్చు చేస్తారు.గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరిస్తారు.  చేయ వ్యవహారవనందు ఇతరుల సహాయం తీసుకోవట మంచిది. శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి లభిస్తుంది. గృహమునందు సుఖశాంతులు లభిస్తాయి.సమాజమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభ ఫలితాలు పొందగలరు. వారాంతంలో ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకములు ఎదురైన ఫలితం కనిపిస్తుంది.ఆదాయ వ్యయాలకు పొంతన ఉండక పోవచ్చు. వాగ్వాదాలు వలన వివాదాలు ఏర్పడగలవు.అనుకున్న పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త అవసరము

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర
చీకు చింత పెరుగుతాయి. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. చేయు వ్యవహారమునందు తెలివితేటలు తగ్గి ఇబ్బందులకు గురి అవుతారు.
శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టంగా ఉండును.  పనులలో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.కొత్త సమస్యలు ఏర్పడగలవు  ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థి విద్యార్థినులకు చదువుపై శ్రద్ధ వహించాలి.  వ్యాపారము యందు జాగ్రత్త అవసరము.ఉద్యోగులకు  అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నీచమైన ఆలోచనలు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సంతానం తోటి  ప్రతికూలత వాతావరణం. అకారణంగా బంధువులతోటి విరోధాలు ఏర్పడగలవు. వారాంతంలో నిరుద్యోగులకు అనుకూల వార్తలు వింటారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వస్తూ వాహనాది విలాసవంతమైన వస్తువుల కొరకు అధికంగా ఖర్చు చేస్తారు.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
మానసికంగా భయాందోళనగా ఉండును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. అవసరానికి తగిన ధనం లభించడం కష్టంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగును.ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. చేయు వ్యవహారములో  పట్టింపులకు పోకుండా లౌక్యంగా మీ పనులు చక్కపెట్టుకోవాలి.కీలకమైనసమస్యలు పరిష్కారమగును.ఉద్యోగస్తులు పై అధికారులతో మాటపడవలసివస్తుంది.ఇతరుల విషయాలకు మరియు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలి.బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడగలవు. వారాంతంలో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన వస్త్రాభరాణలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
మానసిక శారీరక ఆనందం పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అన్నివైపుల నుండి శుభ ఫలితాలు పొందగలరు. ఆదాయ మార్గాలు బాగుంటాయి.
స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు.ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు.  దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములు చేయు వారికి అన్నిమ రంగములు వారికి అభివృద్ధికరంగాఉంటుంది.దానధర్మాలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆశయం నెవవేరడానికి బాగా కష్టపడవలసి ఉంటుంది.
ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.  కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. దూరపు ప్రయాణాలు అనుకూలించును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వస్తు వాహనాది ఆభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల మీద ద్వేష అసూయాలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు విపత్తులు ఏర్పడవచ్చు. సమస్యల వలన మనసు నందు బాధ ఏర్పడును. మిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
కుటుంబ సంబంధింత విషయాలుఆలోచించి నిర్ణయాలు  తీసుకొనవలెను.ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు.  తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. వాగ్దానాలకు హామీలకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండవలెను.  కుటుంబ సమస్యలు ఏర్పడి చికాకు పుట్టించును . విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.అభివృద్ధికి సంబంధిత కీలక నిర్ణయం తీసుకుంటారు. చేయు వ్యవహారమునందు స్థిరమైన బుద్ధితో ముందుకు సాగవలెను.  సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకములు ఎదురైన ఫలితం కనిపిస్తుంది.ఆదాయ వ్యయాలకు పొంతన ఉండక పోవచ్చు. వాగ్వాదాలు వలన వివాదాలు ఏర్పడగలవు.అనుకున్న పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త అవసరము. వారాంతంలో ఇంటా బయట గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పట్టదలతో విద్యలో రాణిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ మార్గాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు  ఫలించును.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.  వ్యాపారములు లాభసాటిగా జరుగును. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత లభించను. ఆరోగ్యం బాగుంటుంది.  ఉద్యోగస్తుల హోదా పెరుగును. పని ఒత్తిడి అధికంగా నుండను. తలపెట్టిన పనులు ఆలోచన శక్తితో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో  వినోదాత్మకంగా గడుపుతారు.  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగును.
నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించును. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. సంఘంలో ఉన్నత స్థితి ఉన్న వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి. శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.  వారాంతంలో  ఖర్చు యందు నియంత్రణ అవసరము. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా చేసినాఅమలులో పెట్టలేక పోవచ్చు. కుటుంబం నందు తగు శ్రద్ధ వహించవలెను.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Recommended image2
Planet Reterograde: ఈ 5 రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఆకస్మిక ధనలాభం, అదృష్టం!
Recommended image3
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved