వారఫలితాలు తేదీ 8 అక్టోబర్ శుక్రవారం నుండి 14 గురువారం 2021
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించినరీతిలో ఉంటుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. దూరపు బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఊరట. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం చివరిలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించినరీతిలో ఉంటుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. బం«ధువులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.. కళారంగం వారికి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. మిత్రులతో విభేదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం అనుకున్న పనుల్లో అవాంతరాలు. శ్రమపడినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగి ఉత్సాహంగా గడుస్తుంది.. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనులలో అవరోధాలు ఎదురైనా అధిగమించి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు అవ్రయత్నంగా దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. అనుకోని ధనవ్యయం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సూచనలు పాటిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.వారంచివరిలో ఆప్తులతో విభేదాలు.. వ్యయప్రయాసలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొన్ని సమస్యలు అధిగమించి ముందడుగు వేస్తారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. బంధువర్గం నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన పనులపూర్తిలో మిత్రులచేయూత అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కివస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మొదట్లో నిరాశపరచినా క్రమేపీ అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుగడిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలను కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక అశాంతి. మిత్రులతో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీ శ్రమ ఫలించి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని అందర్నీ మెప్పిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151