MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • వారఫలితాలు తేదీ 3 సెప్టెంబర్ శుక్రవారం నుండి 9 గురువారం 2021

వారఫలితాలు తేదీ 3 సెప్టెంబర్ శుక్రవారం నుండి 9 గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ వారం పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తీరతాయి

6 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2021, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం మీ వ్యూహాలు, నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మరింత వెసులుబాటు కలుగుతుంది. చేపట్టిన ఇంటి నిర్మాణాలలో కదలికలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతమే. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ప్రయత్నలోపం లేకుండా కృషి చేసి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇళ్లు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం కొంత తొలగుతుంది. అయితే కొన్ని అవసరాలకు రుణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు ప్రారంభం నుంచి లాభాల దిశగానే సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ఇంక్రిమెంట్లు లభించవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తీరతాయి. సోదరులు, మిత్రుల నుంచి ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై విస్తృతంగా చర్చిస్తారు. వాహనయోగం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ శ్రమను గుర్తిస్తారు. కళారంగం వారి సేవలకు  గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్నాళ్లుగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. సోదరులతో ప్రేమానురాగాలు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలు ఆశించినస్థాయిలో ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం కుటుంబంలో శుభకార్యాలపై తుది నిర్ణయానికి వస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆస్తులు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం మొదట్లో ఇబ్బందులతో కొంత సతమతమైనా దీక్షతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు పూర్తి చేయాలన్న తపనతో శ్రమిస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మీ నేర్పు, ఓర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మీ నేర్పు, ఓర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మీ నేర్పు, ఓర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఆస్తుల వివాదాలు కొంతమేర తీరే సూచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రేయోభిలాషుల ఆప్యాయత, ఆదరణ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలు మరింత సంతోషదాయకంగా గడుపుతారు. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో భాగస్వాముల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. కళారంగం వారికి అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండి రుణాలు సైతం తీరతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు లేనిపోని వివాదాలు నెలకొనవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1314
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Recommended image2
Planet Reterograde: ఈ 5 రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఆకస్మిక ధనలాభం, అదృష్టం!
Recommended image3
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved