వార ఫలాలు: ఈ రాశివారికి వారం మధ్యలో శుభవార్తలు. స్థిరాస్తి లాభం.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం సంతానం మూలంగా కొంత సమస్యలు ఏర్పడవచ్చు.ఆర్ధికంగా బలంగా ఉన్నప్పటికీ అప్పులు చేయవలసి రావచ్చు.దూరప్రాంత ప్రయాణాలు కలసి వస్తాయి. అనుకోని గొడవలు.సంఘంలో తెలివిగా వ్యవహారం చేయాలి.
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. చేయు పనులలో అలసత్వం.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీరు ఎంతగానో నమ్మిన మిత్రులే మీకు అపకారం చేయాలని చూస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. సంతానం మూలంగా కొంత సమస్యలు ఏర్పడవచ్చు.ఆర్ధికంగా బలంగా ఉన్నప్పటికీ అప్పులు చేయవలసి రావచ్చు.దూరప్రాంత ప్రయాణాలు కలసి వస్తాయి. అనుకోని గొడవలు.సంఘంలో తెలివిగా వ్యవహారం చేయాలి.స్తిరాస్థి వృద్ధి. మనస్స నందు తెలియని భాద.ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వచ్చే వారం . బంధు మిత్రుల కలయిక. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహము నందు ప్రతికూల వాతావరణం. నూతన వస్తు వాహనప్రాప్తి. చేయు పనులలో ఆటంకాలు లేక నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు స్వల్ప ధన లాభాలు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం మీరు కాస్తంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగము నందు ఒడిదుడుకులు.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఇతరుల విషయంలో జోక్యం తగదు. బంధు మిత్రులతో అనుకోని కలహాలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు కలిగిస్తాయి. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం మీకు శుభవారం..అన్ని విధాలా అనుకూలం. భూ గృహ నిర్మాణాలకు అనుకూలం.ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు సమకూరుతుంది. అనవసరమైన సంభాషణల వలన ఆపదలు రావచ్చు. ఋణాలు తీరి కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం మీ జీవితంలో కొంత ప్రత్యేకతను తీసుకువస్తుంది. ధర్మ కార్యాలు, దాన ధర్మాలను చేస్తారు. అనవసమైన కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతానం అభివృద్ధి. శరీరము నందు నిస్సతువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సంఘం నందు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.శారీరక శ్రమ. పాత బాకీలు వసూలగును. మీ యొక్క ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారంలో చాలా కాలం గుర్తుండిపోయే సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. సంఘంలో పెద్దవారి సహకారంతో లాభాలు పొందుతారు. కుటుంబ వృద్ధి కొరకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సామరస్యంగా వ్యవహరించాలి. స్తిరాస్థి క్రయవిక్రయాలలో తెలివిగా వ్యవహరించాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత వహించండి. జీవిత భాగస్వామితో సఖ్యతగా మేలగవలెను. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.వారాంతంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారం మీకు అద్బుతమైన ఫలితాలను సూచిస్తోంది. శుభకార్యాచరణ.తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.మనస్సు నందు ఆందోళన.స్థిరాస్థి క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను. ఆర్దికపరమైన ఇబ్బందులు కొంతమేర చికాకు కలిగిస్తాయి. ఉద్యోగము నందు కొంత చికాకులు. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శుభవార్తలు వింటారు.నూతన వస్తు వాహన ప్రాప్తి.దీర్ఘకాలిక రోగముల నుండి కొంతమేర ఉపశమనం పొందుతారు. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం మీ జీవితంలో ఓ ప్రత్యేకతను తీసుకువస్తుంది. ఉద్యోగము నందు అభివృద్ధి.అనుకున్న పనులలో సంపూర్ణ విజయం లభిస్తుంది.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడగలవు.అకారణంగా కోపం, కలహాలు.వృత్తి వ్యాపారాలలో లాభాలు.కుటుంబం నందు చికాకులు.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.దూర ప్రయాణాలు. సంఘంలో మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు.పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.ఉహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పశ్చిమదిశ ప్రయణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహము నందు శుభకార్యాచరణ.నమ్మినవారు మోసం చేయవచ్చు. జాగ్రత్త అవసరం.చేయు పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.. ఉద్యోగంలో పై అధికారుల మన్ననలు. సంఘము నందు అపకీర్తి. అంచనాలకు మించి అధిక ఖర్చులు.బంధు మిత్రులతో కలహాలు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. విలువైన వస్తువుల యందు జాగ్రత్త వహించాలి. చర, స్థిరాస్థుల విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవలెను. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం కొన్ని జాగ్రత్తలు, భగవంతుడి పై దృష్టి పెట్టడం ద్వారా ఆపదలు నుంచి బయిటపడతారు. ఆదాయమార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో చికాకులు. నూతన వస్తు వాహన ప్రాప్తి.సంఘము నందు కీర్తి ప్రతిష్టలు.అనుకోని ప్రయాణాలు.దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కొంత ఉపశమనం. వారాంతంలో తలపెట్టిన పనులు పూర్తగును. పనులలో ఒత్తిడి, శ్రమాధికం. సోదరుల సహాయ సహకారాల కోసం సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.మీ పనుల యందు భాద్యత ఇతరులకు అప్పగించకండి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనుల్లో కదిలిక వస్తుంది. భూ గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధన లాభం.కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.అకారణంగా కోపం.సంఘంలో మీయొక్క ప్రవర్తన వలన కొన్ని సమస్యలు ఎదుర్కుంటారు.కొత్త కార్యాలకు ఆలోచనలు చేస్తారు. నూతన పరిచయాలు.ఉద్యోగ ప్రయత్నాలలో నిరాశ.స్థానచలనాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.వారాంతంలో అధిక ఖర్చులు.పిల్లల చదువు నందు శ్రద్ధ వహించవలెను.కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న ఋణ భాదలు తీరి ఉపసమనం లభిస్తుంది. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారం అతి సామాన్యంగా ఉంటుంది. కాస్తంత అప్రమత్తత అవసరం. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగులకు పై అధికారులతో అనవసరమయిన కలహాలు. విద్యార్ధులు పట్టుదలతో చదవవలెను. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.ఇతరుల విషయంలో జోక్యం తగదు. రావలసిన పాత బాకీలు వసూలగును.మనస్సు నందు ఆందోళన. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి అప్పులు చేస్తారు. స్థిరాస్థి క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది.సంతానానికి ఉన్నత విద్యావకాశాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.