MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు 1 అక్టోబర్ శుక్రవారం నుండి 7 గురువారం 2021

వారఫలితాలు 1 అక్టోబర్ శుక్రవారం నుండి 7 గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ముఖ్యమైన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

5 Min read
Author : ramya Sridhar
Published : Oct 01 2021, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి బంధువుల ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరించేందుకు యత్నిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందవచ్చు. వారం చివరిలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత ఊరటనిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆశలు. వ్యాపారాలలో అనుకున్నంతగా లాభాలు రాగలవు.  ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ముఖ్యమైన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో  అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. వారం చివరిలో ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు.  కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు.  విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు కీలక సమాచారం అందుకుంటారు.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు రాగలవు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు.  బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రాగలదు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో కీలక మార్పులు జరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు కొంత అనుకూలస్థితి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

713

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు.  కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.  ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పెట్టుబడులు అంది పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. ఒప్పందాలు వాయిదా. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పైస్థాయివారి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవల్సి ఉంటుంది. బంధువులతో విరోధాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి, విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో  చికాకులు తప్పవు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం దక్కదు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి.  నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తిలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి రాజయోగం? ఏ రాశివారికి కష్టకాలం?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు వస్తాయి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved