MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు 17 సెప్టెంబర్ శుక్రవారం నుండి 23 గురువారం 2021

వారఫలితాలు 17 సెప్టెంబర్ శుక్రవారం నుండి 23 గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు

6 Min read
Author : ramya Sridhar
Published : Sep 17 2021, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం మొదట్లో  కొద్దిపాటి సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు  సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు పుంజుకుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాలలో  మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.  విద్యార్థులకు పురోగతి ఉంటుంది. వ్యాపారాలు  లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో  ఆరోగ్యసమస్యలు. శ్రమాధిక్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం సన్నిహితులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పనిఒత్తిడులు అ««ధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. కొన్ని ∙పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు రావచ్చు. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు  ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు.  వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం కొన్ని  పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు  చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లబిస్తుంది. కళారంగం వారికి కొత్త   యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యతిరేకంగా ఉన్న వారు సైతం మీపై అనుకూలత వ్యక్తం చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగయత్నాలలో పురోగతి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, రుణాల నుంచి విముక్తి లభిస్తుంది.   ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన వ్యవహారాలు∙ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆత్మీయులతో  విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.  ఆరోగ్యంపై  శ్రద్ధ వహించండి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడవచ్చు. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో  కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి.  కొన్ని సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.మిత్రులతోవివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయవర్గాల కృషి ఇంతకాలానికి ఫలిస్తుంది. వారం  చివరిలో వృథా ధనవ్యయం. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం అనుకున్న పనులు స్వయంకృషితో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు∙ఊరట లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగవిధుల్లో అవాంతరాలు తొలగుతాయి.  పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణాలు తీరే సమయం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో కొత్త వ్యక్తులు పెట్టుబడులు పెట్టే వీలుంది. ఉద్యోగాలలో ఊహించని  బాధ్యతలు దక్కవచ్చు. కళారంగం వారికి   అనుకూల పరిస్థితులు. వారం మధ్యలో   వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం శత్రువులు కూడా మీ మాటలకు ఆకర్షితులవుతారు. అనుకున్న  పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో  బంధువులతో తగాదాలు. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం అనుకున్న  పనులు  సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ముఖ్య  సమాచారం అందుతుంది.  వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1314
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Recommended image2
Shani Amavasya: అరుదైన శని అమావాస్య.. ఈ రాశులకు ఊహించని కష్టాలు, చిన్న పరిహారం చేస్తే చాలు
Recommended image3
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved